![AP state govt has failed to get funds central schemes](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/BABU-01.jpg.webp?itok=I3QclDkw)
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం
రాష్ట్రంలో ఆ పథకాలను అమలు చేయకూడదన్నదే కూటమి సర్కారు లక్ష్యం
ఎక్కడ వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందోనని భయం
అందువల్లే ఉద్దేశ పూర్వకంగా వినియోగ పత్రాలు పంపని వైనం
ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరుకు రూ.5,524.48 కోట్లే రాబడి
అదే గత ఆర్థిక ఏడాది జగన్ సర్కారులో రూ.14,669.63 కోట్లు
పొరుగు రాష్ట్రం తెలంగాణకు రూ.12,281.60 కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల వెల్లడి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ముందుచూపు కరువైంది. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని డప్పు కొట్టీ కొట్టీ.. అలవిగాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నాలుక తిరగేస్తోంది. సరిపడా డబ్బుల్లేనందున హామీలు అమలు చేయలేమని సిగ్గు విడిచి చెబుతోంది. కేంద్ర పథకాల అమలు కోసం వచ్చే నిధులనూ వదులుకుంటోంది. ఎందుకంటే ఆ పథకాలు నిరాటంకంగా కొనసాగితే గత సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందన్న కసే కారణం
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని స్పష్టమైంది. కేంద్ర ప్రాయో జిత పథకాల కింద నిధులు రాబట్టడంలో విఫలమవ్వ డమే ఇందుకు నిదర్శనం. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అమలు చేసిన పథకాలను నిలుపుదల చేయాలన్న కసే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ వినియోగ పత్రాలను పంపించినట్లయితే ఆయా పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేసేది.
వినియోగ పత్రాలు పంపక పోవడంతో జాతీయ హెల్త్ మిషన్, పీఎంఏవై, గ్రామీణ సడక్ యోజన, మధ్యాహ్న భోజన పథకం తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులు అందలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరు నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి కేవలం రూ.5,524.48 కోట్లు విడుదలవ్వగా, గత ఆర్థిక ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా రూ.14,669.63 కోట్లు వచ్చాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/GRA-06-02.jpg)
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధుల రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందడం గమనార్హం. పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా రాష్ట్రానికి కేంద్ర నిధులు వచ్చాయి. తెలంగాణకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.12,281.60 కోట్లు వచ్చాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/4_56.png)
ప్రతిపాదనలు పంపనందునే..
వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపక పోవడంతోనే మిగతా రాష్ట్రాల కన్నా అతి తక్కువగా నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలుపుతాయని, అనంతరమే నిధులు వస్తాయని అర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం కేంద్ర పథకాల నుంచి నిధులు తెచ్చుకోవడంపై దృష్టి సారించకుండా ఇన్ని రోజులు గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తోంది.
గత ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి కోసం చేపట్టిన మన బడి నాడు–నేడు, మౌలిక సదుపాయాల కల్పన పనులను ఈ ప్రభుత్వం నిలుపుదల చేసిందని, దీంతో ఆయా పథకాలకు కేంద్రం నుంచి నిధులు రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బిహార్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల కన్నా అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను మళ్లించేసిందంటూ కూట మి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రూ.2,51,294.84 కోట్లు విడుదలైతే ఇందులో ఏపీకి వచ్చింది కేవలం రూ.5,524.48 కోట్లేనని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment