తెలంగాణలో గెలిచే అవకాశం
గుర్తించిన బీజేపీ జాతీయ నాయకత్వం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించింది. పార్టీ బలంగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకున్నందున.. 2019 ఎన్నికల్లో ఆ స్థాయిలో సీట్లు రాకున్నా మిగతా రాష్ట్రాల నుంచి ఆ సంఖ్యను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కార్యాచరణను రూపొం ది స్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కార్యక్రమాల నిర్వహణ, సన్నద్ధత, రాష్ట్రస్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు ఉన్న స్థితిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరి శీలన మొదలుపెట్టారు. గురువారం జిల్లాల్లో పర్యటించి, శుక్రవారం మళ్లీ పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు. త్వరలో అమిత్‌షాకు రాష్ర్టంలో పార్టీ పరిస్థితిపై నివేదికను సమర్పిస్తారు.
అధికార మే లక్ష్యంగా పనిచేయాలి..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడ మే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ర్ట పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి జాతీయపార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తెలంగాణతో సహా 7 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణానికి, బలోపేతానికి, పార్టీని ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చేందుకు జాతీయపార్టీ ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నదన్నారు. కేంద్ర పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కేంద్రం అందిస్తున్న సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలియజేయడం లేదని విమర్శించారు.