రోజురోజుకు ఎండలు పెరుగుతుండగా.. జిల్లా లో శుక్రవారం వడదెబ్బ కారణంగా 23 మంది మృతి చెందారు.
పోచమ్మమైదాన్ : నగరంలో కొత్తవాడకు చెంది న క్యాతం లింగయ్య(85) ఆటోనగర్‌లో పనిచేస్తాడు. ఎండలు వేడిగాలులు బాగా ఉండడంతో వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు.
వెల్దండ(నర్మెట) : మండలంలోని వెల్దండకు చెందిన కొలిపాక రజిత(35) వ్యవసాయం భర్త తో కలిసి వ్యవసాయం చేస్తుండగా, గురువారం బావి వద్దకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వెంటనే ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అరుునా తగ్గకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
నర్సంపేట రూరల్ : వుండలంలోని దాసరిపల్లికి చెందిన వుండల కొవుురవ్ము(68) ఉపాధి కూలీకి వెళ్తోంది. ఈక్రమంలో అస్వస్థతకు గురి కాగా, చికిత్స చేరుుస్తుండగా వుృతి చెందింది.
ధర్మసాగర్ : గ్రామానికి చెందిన ఆవుల కొ మురమ్మ(80) వడదెబ్బకు గురైంది. ఈ మేరకు గురువారం రాత్రి తన ఇంట్లో మృతి చెందింది.
కాశిబుగ్గ : వరంగల్ వివేకానంద కాలనీకి చెందిన దేవర రాజమణి-కిషోర్ కుమార్తె, ఏడో తరగతి విద్యార్థి హరిత(12) ఆడుకునే క్రమం లో గురువారం వడదెబ్బకు గురైంది. కుటుంబ సభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొం దుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది.
ఏటూరునాగారం : మండలంలోని గుర్రెవులకు చెందిన పూజారి బుసయ్య(65) మిరప కళ్లం వద్ద కూలీకి వెళ్లాడు. అక్కడ ఎండదెబ్బకు గురైన ఆయనకు గురువారం రాత్రి వాంతులు, విరోచనాలు కాగా, శుక్రవారం మృతి చెందాడు.
రాజోలు(కురవి) : రాజోలుకు చెందిన పడా ల వర్ధయ్య(50) చేను వద్దకు వెళ్తుండగా ఎండవేడితో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికు లు ఊరికి తీసుకొస్తుండగా మృతి చెందాడు.
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు చోక్లా తండకు చెందిన గుగులోత్ సోమ్లా-భద్రి కుమా ర్తె ఐశ్వర్య(12) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. వారంగా ఎండ తీవ్రత వల్ల ఐశ్వర్య అస్వస్థతకు గురైన ఆమెను శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
నెక్కొండ : మండల కేంద్రానికి చెందిన కొంకాల సాయిలు(66) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. సాయిలుకు నలుగురు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురు ఉదయ తలకొరివి పెట్టింది. అలాగే, సాయిరెడ్డిపల్లికి చెందిన గునుగుంట్ల వెంకటేశ్వర్లు(45) వడదెబ్బకు గురికాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ తరలించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పెద్దకొర్పోలుకు చెందిన బండారి కమలమ్మ(72) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందింది.
చిట్యాల : మండలంలోని జూకల్లు గ్రామానికి చెందిన మేకల వీరస్వామి(70) వడదెబ్బకు గురై శుక్రవారం వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చిట్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
మడికొండ : హన్మకొండ మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. వనమాలకనపర్తి గ్రామానికి చెందిన తంపుల రామయ్య(70), మడికొండ గ్రామానికి చెందిన బొల్లికొండ రాజు(50) శుక్రవారం మృతి చెందాడు.
మద్దూరు : మండలంలోని ధూల్మిట్టకు చెంది న రైతు తుషాలపురం రాజయ్య(64) వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు చికిత్స పొందు తూ మృతి చెందాడు.
చెన్నారావుపేట : వుండలంలోని పాపయ్యుపేటకు చెందిన ఉప్పుల భద్రవ్ము(58) వ్యవసా యు పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెం దింది. అలాగే, ఖాధర్‌పేట గ్రావు శివారులోని గొల్లపెల్లెకు చెందిన వజినపల్లి సుదర్శన్(60) కిరాణం సామగ్రి తెచ్చేందుకు వెళ్తూ వడదెబ్బకు గురై వుృతి చెందాడు.
డోర్నకల్ : డోర్నకల్ యాదవనగర్‌కు చెంది న ఎర్రబోయిన రాములు(70) తీవ్ర ఎండలతో గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం చికిత్స చేయించే ప్రయత్నాలు చేస్తుండగా మృతి చెందాడు.
భూపాలపల్లి : భూపాలపల్లి నగర పంచాయ తీ జంగేడు శివారు కాకతీయకాలనీలో నివాసముండే వైనాల సదయ్య(50) చేపలు పెంచుకుంటూ జీవనం సాగించేవాడు. గురువారం ఉ దయం నుంచి సాయంత్రం వరకు చెరువు వద్దే ఉన్న ఆయన వడదెబ్బకు గురై మృతి చెందాడు.
చింతలపల్లి(సంగెం) : మండలంలోని చింతలపల్లికి చెందిన దుడ్డె వెంకటలక్ష్మి(70) గురువారం పొలం వద్దకు వెళ్లింది. అక్కడ వడదెబ్బకు గురైన ఆమె శుక్రవారం మృతి చెందింది.
పరకాల : ధర్మారానికి చెందిన గొర్ల కాపరి చిన్న సమ్మయ్య(48) గొర్లను మేపడానికి వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు నిద్రలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
గోపాల్‌నగర్(బచ్చన్నపేట): మండలంలోని చిన్నరామన్‌చర్ల శివారు గోపాల్‌నగర్‌లో గంగంరబోయిన బిక్షపతి(60) వడదెబ్బతో మృతి చెం దాడు. గురువారం కూలీకి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు.
జనగామ రూరల్ : జనగామ మండలం గోపరాజుపల్లికి చెందిన వాటర్‌మెన్ పెరుమాం డ్ల కిషన్ వడదెబ్బతో మృతి చెందాడు. గొర్రెలు మేపడానికి వెళ్లి ఆయన ఎండ కారణంగా వడదెబ్బ బారిన పడ్డాడు.
వడదెబ్బతో 23 మంది మృతి
Published Sat, Apr 30 2016 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement