సాక్షి నెట్‌వర్క్ : జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం ఎనిమిది మంది మృతిచెందారు. నిండ్ర వుండలం నెట్టేరి ఆదిఆంధ్రవాడకు చెందిన మునస్వామి భార్య చెంగవ్ము(56) సోమవారం ఇంటి నుంచి రోడ్డుపై నడిచి వెళుతుండగా స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఆమె మృతిచెందింది. ఆరూరు గ్రామానికి చెందిన నాగతర్నవ్ము (67) వుంగళవారం వుధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వస్తుండగా కుప్పకూలిపోరుుంది. ఇంటికి తీసుకెళుతుండగా చనిపోయింది. నారాయణవనం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిగకు చెందిన రాధాకృష్ణయ్య(56) ఎండ తీవ్రతతో నాలుగు రోజులుగా నీరసంగా ఉండి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు.
ఇప్పన్‌తాంగాళ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ(64) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐరాల మండలం మెటకంపల్లె గ్రామానికి చెందిన మునార్‌సాహెబ్ (60) ఐస్ వ్యాపారం చేసేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స చేశారు. మంగళవారం వేకువజామున మరణించాడు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య(45) మంగళవారం ఉదయం కూలి పనులకెళ్లాడు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామచంద్రాపురం మండలం పాతకందులవారిపల్లి పంచాయతీ ఐఏవైకాలనీకి చెందిన కె.చిన్నసామి(70) కూలి పని చేసుకుని జీవించేవాడు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్మపల్లి పీహెచ్ సీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరదయ్యుపాళెం వుండలం పెద్దపాండూరు గ్రామానికి చెందిన గిరి(40) వుంగళవారం ఉదయుం పొలంలో దుక్కిదున్నుతుండగా వడగాల్పులకు సృ్పహ తప్పిపడిపోయూడు. సూళ్ళూరుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.