summer solstice
-
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం ఎనిమిది మంది మృతిచెందారు. నిండ్ర వుండలం నెట్టేరి ఆదిఆంధ్రవాడకు చెందిన మునస్వామి భార్య చెంగవ్ము(56) సోమవారం ఇంటి నుంచి రోడ్డుపై నడిచి వెళుతుండగా స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఆమె మృతిచెందింది. ఆరూరు గ్రామానికి చెందిన నాగతర్నవ్ము (67) వుంగళవారం వుధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వస్తుండగా కుప్పకూలిపోరుుంది. ఇంటికి తీసుకెళుతుండగా చనిపోయింది. నారాయణవనం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిగకు చెందిన రాధాకృష్ణయ్య(56) ఎండ తీవ్రతతో నాలుగు రోజులుగా నీరసంగా ఉండి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇప్పన్‌తాంగాళ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ(64) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐరాల మండలం మెటకంపల్లె గ్రామానికి చెందిన మునార్సాహెబ్ (60) ఐస్ వ్యాపారం చేసేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స చేశారు. మంగళవారం వేకువజామున మరణించాడు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య(45) మంగళవారం ఉదయం కూలి పనులకెళ్లాడు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామచంద్రాపురం మండలం పాతకందులవారిపల్లి పంచాయతీ ఐఏవైకాలనీకి చెందిన కె.చిన్నసామి(70) కూలి పని చేసుకుని జీవించేవాడు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్మపల్లి పీహెచ్ సీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరదయ్యుపాళెం వుండలం పెద్దపాండూరు గ్రామానికి చెందిన గిరి(40) వుంగళవారం ఉదయుం పొలంలో దుక్కిదున్నుతుండగా వడగాల్పులకు సృ్పహ తప్పిపడిపోయూడు. సూళ్ళూరుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
కాశిబుగ్గ : వడ గాల్పులకు, ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో ఆదివారం తొమ్మిది మంది మృతి చెందారు. వివారాలు... వరంగల్ 16వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన జన్ను అరుణ(25) వడదెబ్బకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. శనివారం కూలీకి వెళ్లి అరుణ పని చేస్తూ ఎండ వేడి తాకిడికి గురై అస్వస్థతకు గురైంది. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. కరీమాబాద్ : కరీమాబాద్ దసరా రోడ్‌లోని అప్పాల రాజుకుమార్(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న రాజుకుమార్ ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. చెన్నారావుపేట: వుండలంలోని పాత వుగ్దుం పురం గ్రావూనికి చెందిన దొనికల భద్రవ్ము (65) వంట చెరుకు కోసం బయుటికి వెళ్లింది. దీంతో వడదెబ్బకు గురై వుృతి చెందింది ఇప్పగూడెం(స్టేషన్‌ఘన్‌పూర్): మండలంలోని ఇప్పగూడెంకు చెందిన బట్టమేకల ఆగమ్మ (90) వడదెబ్బతో మృతిచెందింది. ఆమె ఆది వారం ఉదయం అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందింది. నెల్లికుదురు : మండలంలోని వావిలాల గ్రా మానికి చెందిన ఎరుకొండ పరమేష్ (23) వడ దెబ్బతో మృతిచెందాడు. పరమేష్ గౌడ కుల స్తులకు కథలు చెప్పుకుంటూ జీవనం సాగి స్తుంటాడు. ఈ క్రమంలో కతలు చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో ఆదివారం వడ దెబ్బకు గుైరె అస్వస్థతకు గురయ్యూడు. చికిత్స నిమిత్తం 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. డోర్నకల్: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని దాన్యా తండాకు చెందిన కేలోతు హరి(60) వడ దెబ్బతో మృతి చెందాడు. హరి కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామంలో మబ్బు సిద్దయ్య (55) వడదెబ్బతో మృతి చెందాడు. సిద్దయ్య ఇంటి వద్ద ఇంకుడు గుంత తీస్తుండగా తీవ్రమైన ఎండతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మన్సాన్పల్లి(బచ్చన్నపేట): మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన శాకంపల్లి మల్లారెడ్డి (75) వడదెబ్బతో మృతిచెందాడు. మల్లారెడ్డి రోజూ ఉదయం, సాయంత్రం బావి వద్దకు వెళ్లి వచ్చే వాడు. రోజూ మాదిరిగానే ఆయన ఆదివారం బావి వద్ద వెళ్లి వచ్చి అస్వస్థతకు గురి కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకపోతుండగానే మృతి చెందాడు. -
వడదెబ్బకు ఆరుగురి మృతి
భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మేర కు ఎండతీవ్రత కారణంగా శనివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ఆరుగురు వడదెబ్బకు గురై మృతిచెందారు. మద్దూరు : మండల కేంద్రానికి చెందిన ఇట్టబోరుున సిద్ధిరాములు (68) వడదెబ్బతో మృతి చెందాడు. ఇంటివద్ద ఉంటున్న ఆయన వడగాలులకు తీవ్ర కు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. గుండ్రాతిమడుగు (కురవి) : మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) గ్రామానికి చెందిన కుంచం వెంకటేశ్వర్లు(49) వడదెబ్బతో మృతి చెందాడు. పని నిమిత్తం బయటకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మడికొండ : హన్మకొండ మండలంలోని మడికొండ గ్రామానికి చెందిన కొలిశెట్టి నర్సమ్మ(64) వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం కూలీ పనులకు వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములుగు : మండలంలోని కాసీందేవిపేటకు చెందిన సల్లూరి రవి (42) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి శుక్రవారం ఉదయం కూలీపనికి వెళ్లాడు. అరుుతే ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్‌కు చెందిన గుమస్తా వడికిచెర్ల రాజన్‌బాబు (52) వడదెబ్బతో మృతి చెందాడు. రాజన్‌బాబు మూడు రోజుల క్రితం తన కూతురు వివాహం చేశాడు. అరుుతే ఆ సమయంలో పెండ్లి పనుల్లో భాగంగా ఎండలో తిరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పరిధిలోని తూర్పుకోటకు చెందిన వ్యవసాయ కూలి మేకల కుమార్(38) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోజు మాదిరిగా భార్యతో కలిసి కూలీకి వెళ్లిన ఆయన సాయంత్రం వడదెబ్బకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. కాగా, శనివారం ఉదయం కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. -
వడదెబ్బతో 23 మంది మృతి
రోజురోజుకు ఎండలు పెరుగుతుండగా.. జిల్లా లో శుక్రవారం వడదెబ్బ కారణంగా 23 మంది మృతి చెందారు. పోచమ్మమైదాన్ : నగరంలో కొత్తవాడకు చెంది న క్యాతం లింగయ్య(85) ఆటోనగర్‌లో పనిచేస్తాడు. ఎండలు వేడిగాలులు బాగా ఉండడంతో వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. వెల్దండ(నర్మెట) : మండలంలోని వెల్దండకు చెందిన కొలిపాక రజిత(35) వ్యవసాయం భర్త తో కలిసి వ్యవసాయం చేస్తుండగా, గురువారం బావి వద్దకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వెంటనే ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అరుునా తగ్గకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. నర్సంపేట రూరల్ : వుండలంలోని దాసరిపల్లికి చెందిన వుండల కొవుురవ్ము(68) ఉపాధి కూలీకి వెళ్తోంది. ఈక్రమంలో అస్వస్థతకు గురి కాగా, చికిత్స చేరుుస్తుండగా వుృతి చెందింది. ధర్మసాగర్ : గ్రామానికి చెందిన ఆవుల కొ మురమ్మ(80) వడదెబ్బకు గురైంది. ఈ మేరకు గురువారం రాత్రి తన ఇంట్లో మృతి చెందింది. కాశిబుగ్గ : వరంగల్ వివేకానంద కాలనీకి చెందిన దేవర రాజమణి-కిషోర్ కుమార్తె, ఏడో తరగతి విద్యార్థి హరిత(12) ఆడుకునే క్రమం లో గురువారం వడదెబ్బకు గురైంది. కుటుంబ సభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొం దుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఏటూరునాగారం : మండలంలోని గుర్రెవులకు చెందిన పూజారి బుసయ్య(65) మిరప కళ్లం వద్ద కూలీకి వెళ్లాడు. అక్కడ ఎండదెబ్బకు గురైన ఆయనకు గురువారం రాత్రి వాంతులు, విరోచనాలు కాగా, శుక్రవారం మృతి చెందాడు. రాజోలు(కురవి) : రాజోలుకు చెందిన పడా ల వర్ధయ్య(50) చేను వద్దకు వెళ్తుండగా ఎండవేడితో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికు లు ఊరికి తీసుకొస్తుండగా మృతి చెందాడు. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు చోక్లా తండకు చెందిన గుగులోత్ సోమ్లా-భద్రి కుమా ర్తె ఐశ్వర్య(12) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. వారంగా ఎండ తీవ్రత వల్ల ఐశ్వర్య అస్వస్థతకు గురైన ఆమెను శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నెక్కొండ : మండల కేంద్రానికి చెందిన కొంకాల సాయిలు(66) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. సాయిలుకు నలుగురు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురు ఉదయ తలకొరివి పెట్టింది. అలాగే, సాయిరెడ్డిపల్లికి చెందిన గునుగుంట్ల వెంకటేశ్వర్లు(45) వడదెబ్బకు గురికాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ తరలించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పెద్దకొర్పోలుకు చెందిన బండారి కమలమ్మ(72) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందింది. చిట్యాల : మండలంలోని జూకల్లు గ్రామానికి చెందిన మేకల వీరస్వామి(70) వడదెబ్బకు గురై శుక్రవారం వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చిట్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మడికొండ : హన్మకొండ మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. వనమాలకనపర్తి గ్రామానికి చెందిన తంపుల రామయ్య(70), మడికొండ గ్రామానికి చెందిన బొల్లికొండ రాజు(50) శుక్రవారం మృతి చెందాడు. మద్దూరు : మండలంలోని ధూల్మిట్టకు చెంది న రైతు తుషాలపురం రాజయ్య(64) వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు చికిత్స పొందు తూ మృతి చెందాడు. చెన్నారావుపేట : వుండలంలోని పాపయ్యుపేటకు చెందిన ఉప్పుల భద్రవ్ము(58) వ్యవసా యు పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెం దింది. అలాగే, ఖాధర్పేట గ్రావు శివారులోని గొల్లపెల్లెకు చెందిన వజినపల్లి సుదర్శన్(60) కిరాణం సామగ్రి తెచ్చేందుకు వెళ్తూ వడదెబ్బకు గురై వుృతి చెందాడు. డోర్నకల్ : డోర్నకల్ యాదవనగర్‌కు చెంది న ఎర్రబోయిన రాములు(70) తీవ్ర ఎండలతో గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం చికిత్స చేయించే ప్రయత్నాలు చేస్తుండగా మృతి చెందాడు. భూపాలపల్లి : భూపాలపల్లి నగర పంచాయ తీ జంగేడు శివారు కాకతీయకాలనీలో నివాసముండే వైనాల సదయ్య(50) చేపలు పెంచుకుంటూ జీవనం సాగించేవాడు. గురువారం ఉ దయం నుంచి సాయంత్రం వరకు చెరువు వద్దే ఉన్న ఆయన వడదెబ్బకు గురై మృతి చెందాడు. చింతలపల్లి(సంగెం) : మండలంలోని చింతలపల్లికి చెందిన దుడ్డె వెంకటలక్ష్మి(70) గురువారం పొలం వద్దకు వెళ్లింది. అక్కడ వడదెబ్బకు గురైన ఆమె శుక్రవారం మృతి చెందింది. పరకాల : ధర్మారానికి చెందిన గొర్ల కాపరి చిన్న సమ్మయ్య(48) గొర్లను మేపడానికి వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు నిద్రలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాల్‌నగర్(బచ్చన్నపేట): మండలంలోని చిన్నరామన్చర్ల శివారు గోపాల్‌నగర్‌లో గంగంరబోయిన బిక్షపతి(60) వడదెబ్బతో మృతి చెం దాడు. గురువారం కూలీకి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలం గోపరాజుపల్లికి చెందిన వాటర్‌మెన్ పెరుమాం డ్ల కిషన్ వడదెబ్బతో మృతి చెందాడు. గొర్రెలు మేపడానికి వెళ్లి ఆయన ఎండ కారణంగా వడదెబ్బ బారిన పడ్డాడు. -
వడదెబ్బతో 13 మంది మృతి
ఉదయం ఏడు దాటుతుండగానే నడినెత్తిపైకి వస్తున్న సూర్యుడు, మండుతున్న ఎండలు.. ఫలితంగా వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడి గాలులు తట్టుకోలేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు సోమవారం వడదెబ్బ కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతి చెందారు. మడికొండ : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్లోని బాలజీనగర్కు చెందిన దేవర మణేమ్మ (60) ఆదివారం పని కి వెళ్లింది. సోమవారం ఉదయం తర్వాత వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాజీపేట : కాజీపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై తిలక్‌నగర్‌కు చెందిన గొర్రె దర్గమ్మ(52), బాలాజీనగర్ చెందిన దేవర మీనమ్మ(65) మరణించారు. కరీమాబాద్ : వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిట్ట పుల్లమ్మ(80) వడదెబ్బతో తీవ్ర అస్వస్తతకు గురై సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసముద్రం : ఇనుగుర్తికి చెందిన లింగాడపు వెంకన్న(35) కొద్దిరోజులుగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు. చేర్యాల : వేచరేణికి చెందిన మాదాసు చంద్రమ్మ(60) రోజు వారిలాగే వ్యవసాయ కూలీగా వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమ్మ మృతి చెందింది. నాగిరెడ్డిపల్లి(బచ్చన్నపేట) : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దేవరాయ కనుకయ్య(35) ఆదివారం వ్యవసాయ బావి వద్దకు పనుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చి అనారోగ్యంగా ఉందని అన్నం తినకుండానే పడుకున్నాడు. ఉదయం ఆటోలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు. నర్సింహులపేట: మండలంలోని బీరిశెట్టిగూడెంలో సూరబోయిన కిష్టయ్య(65) వడదెబ్బకు మృతి చెందాడు. ఎండ వేడిమి తీవ్ర అస్వస్తతకు గురైన కిష్టయ్య స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని కంకరబోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సీఐ శేర్ వెంగళయ్య(85) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. దేశాయిపల్లి(దుగ్గొండి) : మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల అయిలయ్య(65) ఇంటి వద్ద రేకులషెడ్డులో నివసిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రంతా ఇంటి వద్ద చికిత్స అనంతరం ఉదయం వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన బక్క భాస్కర్(30) జనగామలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. ఇంటి వద్ద వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ పరిస్థితి తగ్గుముఖం పట్టలేదు. సోమవారం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి గత ఏడాదే వివాహమైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండల కేంద్రానికి చెందిన గట్టు మైసయ్య(65) స్థానికంగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం పనికి వెళ్లిన అతడు రాత్రి ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీరు తాగి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఏటూరునాగారం : మండలంలోని ముల్లకట్టకు చెందిన గడిగ సమ్మక్క (75) పొలం పనుల కోసం ఎండలో తిరగడంతో ఆదివారం రాత్రి వడదెబ్బ తాకింది. ఆమె అపస్మార్థక స్థితికి చేరుకొని సోమవారం వేకువజామున మృతి చెందింది -
చంపేస్తున్నాయ్..!
► విద్యుత్‌షాక్‌కు అమాయకులు బలి ► ఫ్యూజ్ బాక్సులు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ అస్తవ్యస్తం ► కంచెలేని ఫ్యూజ్ బాక్సులు, ట్రాన్స్ఫార్మర్లు ► తాజాగా నాచారంలో ఓ బాలుడి మృతి సాక్షి, సిటీబ్యూరో: మొన్న మోతీనగర్...నిన్న పూల్‌బాగ్, సికింద్రాబాద్...తాజాగా నాచారం...ఇలా నగరంలో రోజూ ఎవరో ఒకరు విద్యుత్ కారణంగా మృతి చెందుతూనే ఉన్నారు. ఆయిల్ లీకేజీలు, అధికభారం వల్ల నిత్యం చరచరమంటూ నిప్పులు కక్కుతున్న ట్రాన్స్ఫార్మర్లకు, ఫ్యూజ్ బాక్సులకు కంచె, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడంతో తెలియక అటుగా వెళ్లిన వారు విద్యుత్ఘాతానికి గురవుతున్నారు. తాజాగా ఆదివారం నాచారంలో వీధిలో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ప్యూజ్ బాక్స్‌లోని విద్యుత్ వైర్లకు తగిలి మృత్యువాతపడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలా అమాయకులు చస్తున్నా...విద్యుత్ అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. బెంగుళూర్లో అలా.. బెంగళూర్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్ ప్రమాణాల మేరకు ఎల్టీ ఏఈ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు 2 ఎంఎం మెటల్ స్టీల్‌తో తయారు చేసి, బస్బార్లు(ఎంసీసీబీ)పై ఏర్పాటు చేసింది. తక్కువ స్థలంలో ఎవరికీ ఆటంకం కలుగకుండా తక్కువ ఖర్చుతో బిగించారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. బాక్స్‌లో మోల్డెన్కేస్ సర్క్యూట్ బ్రేకర్లను ప్రమాణాలకు తగ్గట్టుగా డ్రెస్సింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇవి కాలిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఓవర్ లోడ్‌ను తట్టుకునే విధంగా రైల్వే వారు అనుసరించిన ఎలక్ట్రిఫికేషన్ జీఐ స్వ్కేర్ట్యూబ్స్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. హైదరాబాద్‌లో ఇలా.. నగరంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఒక్కో చోట ఒక్కో విధంగా అమర్చారు. కొన్ని చోట్ల దిమ్మలపై ట్రాన్స్ఫార్మర్లు ఉంచారు. మరి కొన్ని చోట్ల నేలపై బిగించారు. ప్రమాదమని తెలిసినా స్తంభానికి ఫ్యూజ్ బాక్సులు ఏర్పాటు చేశారు. నిర్దిష్ట ప్రమాణాలు లేకుండా ఎత్తు, పట్టింపుల్లేకుండా వాటిని బిగించేశారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ..చాలా చోట్ల చెత్తకుప్పులు పేరుక పోయాయి. ఫ్యూజ్బాక్సుల్లో మందం వైర్లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల లోడు ఎక్కువైనప ్పుడు ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయే ప్రమాదం ఉంది. యూజీ కేబుల్ వర్క్స్‌ను వేగవంతం చేయాలి ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరంలో 40 శాతం భూగర్భలైన్లు ఉంటే..అదే హైదరాబాద్‌లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. భూగర్భ లైనింగ్ పనులను వేగవంతం చేయాలి. కరెంట్ స్తంభాలకు ఇంటర్నెట్ కేబుల్స్ అమర్చుతుండటంతో అవి సాలేగూళ్లను తలపిస్తున్నాయి. - నక్కా యాదగిరి, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేటు ఎలక్ట్రికల్స్ అసోసియేషన్. -
ప్రజలకు బాసటగా ‘సాక్షి’
► లింగంపల్లి దళితకాలనీలో ట్యాంకర్లతో నీటి సరఫరా ప్రారంభం ► ముందుకొచ్చిన దాత ముక్కెర తిరుపతిరెడ్డి ► వేసవి కాలం ముగిసే వరకూ కొనసాగింపు.. జనగామ : జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా మారిన జనగామ నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఈ సమస్య తీర్చాలని ‘సాక్షి’ సంకల్పించింది. సేవా దృక్పథం గల దాతలను సంప్రదించింది. బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త, టీఆర్ఎస్ నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి సహకారం కోరింది. ఆయన సరేననడంతో లింగంపల్లి గ్రామంలోని దళిత కాలనీ నుంచి తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. పది వార్డులు.. సుమారు 3500 జనాభా ఉన్న లింగంపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ రోజుకు 5,500 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌తో వేసవి కాలం పూర్తయ్యే వరకు తాగునీరందిస్తానని తిరుపతిరెడ్డి చెప్పారు. అల్లాడుతున్న లింగంపల్లి లింగంపల్లి గ్రామంలో దళితవాడలో 80 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కాలనీలో మూడు బోర్లు వేసినా, భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోవడంతో సరిపడా నీరు రావడం లేదు. వీధినల్లా గంటకోసారి రెండు మూడు నిమిషాలు వచ్చి ఆగిపోతోంది. ఇలా నీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. వృద్ధులు, పిల్లలు మంచినీటి కోసం ఎండలో ఉంటూ వడదెబ్బకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు సాక్షి ప్రత్యేక చొరవ చూపగా, ముక్కెర తిరుపతిరెడ్డి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు కిష్టయ్య, వార్డుసభ్యులు బండి వరలక్ష్మి నర్సింహులు, ఎం.కమలాకర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దొంతుల మహేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఇమ్మడి సంతోష్, బి.మధు, కొత్తపల్లి రాము, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ క్రిష్ణగోవింద్, వరంగల్ పశ్చిమ ఇంచార్జి కె.క్రిష్ణకుమార్, జనగామ ఆర్సీ ఇంచార్జి కొత్తపల్లి కిర ణ్‌కుమార్, బచ్చన్నపేట రిపోర్టర్ బిక్షపతి పాల్గొన్నారు. గొంతెండుతున్న ప్రజల దాహార్తి తీరుస్తా వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వేసవి ముగిసేందత వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని ‘సాక్షి’ దినపత్రిక వారు నన్ను సంప్రదించారు. దీంతో లింగంపల్లి గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టాం. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో ఇది కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది. - ముక్కెర తిరుపతిరెడ్డి -
ఎండ ప్రచండం!
► జిల్లాలో అనూహ్యంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ► రెంటచింతల, పిడుగురాళ్ల, వినుకొండ ప్రాంతాల్లో మరింత దారుణం ► గత ఏడాదితో పోల్చితే 9 డిగ్రీల అధికంగా నమోదు ► బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం ► అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు, చిరువ్యాపారులు రెంటచింతల 45.8 పిడుగురాళ్ల 45.7 గుంటూరు 43.5 గుంటూరు రూరల్ : ఎండ ప్రచండం కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. భగభగ మండుతున్న ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే చాలు..బయటకు రావాలంటేనే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ దెబ్బకు ప్రయాణాలనూ వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటిందాకా ఇళ్ల నుంచి రావడం లేదు. రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితీ కడుదయనీయంగా మారింది. ఒక పక్క ఎండ..మరో పక్క వడగాడ్పులకు రోడ్లపై ఉండలేక విలవిల్లాడిపోతున్నారు. వ్యాపారాలు పూర్తిగా మందగించాయని అంటున్నారు. కొందరు వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ వారం రోజుల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ నెల మూడో వారంతో ఈ ఏడాది పోల్చితే ఉష్ణోగ్రతలో విపరీత మార్పులు కన్పిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు... రాత్రి ఉష్ణోగ్రతలు సైతం రెండు మూడు డిగ్రీలు పెరగడంతో వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు వేడిమి తట్టుకోక ఉపశమనాలను వెతుక్కుంటున్నారు. రెండు రోజుల్లో గమనిస్తే ఉదయం సాయంత్రం రెండు డిగ్రీల చొప్పున రోజుకు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అత్యధికంగా వేడిమి పెరిగిపోయింది. ఇక జిల్లాలోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే రెంటచింతల, వినుకొండ, పిడుగు రాళ్ళ తదితర ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. వారం రోజుల్లో రోజూ 42 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది... ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలు... గత ఏడాది ఏప్రిల్ మూడో వారంలో కేవలం గుంటూరులో వరుసగా ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 17న 36.8, 18న 35.3, 19న 35.2, 20న 35.4, 21న 35.6, 22న 36 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదయింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు చూస్తే సుమారు 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు ఉన్నాయి. ఇక ఈ ఏడాది గడచిన వారంలో చూస్తే ఆదివారం 39.5, సోమవారం 39.5, మంగళవారం 39.5, బుధవారం 39.8, గురువారం 41.5 శుక్రవారం ఏకంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదయ్యాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష!
ముంబై: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం. ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి. కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి. ఇంట్లో ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి. పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు. పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు. వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి. {పమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. {పమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో.. పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి. తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు. షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి. అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి. కర్మాగారాల్లో.. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్లో ఓవర్ లోడ్ వేయకూడదు. మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే.. {పమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి. ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి. పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి. ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి. వంటింట్లో.. వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్లనే వాడాలి. గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి. వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి. మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు. గోదాముల్లో.. వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి. గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి. వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి. గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి. వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి. గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి.