కాశిబుగ్గ : వడ గాల్పులకు, ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో ఆదివారం తొమ్మిది మంది మృతి చెందారు. వివారాలు... వరంగల్ 16వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన జన్ను అరుణ(25) వడదెబ్బకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. శనివారం కూలీకి వెళ్లి అరుణ పని చేస్తూ ఎండ వేడి తాకిడికి గురై అస్వస్థతకు గురైంది. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది.
కరీమాబాద్ : కరీమాబాద్ దసరా రోడ్‌లోని అప్పాల రాజుకుమార్(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న రాజుకుమార్ ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు.
చెన్నారావుపేట: వుండలంలోని పాత వుగ్దుం పురం గ్రావూనికి చెందిన దొనికల భద్రవ్ము (65) వంట చెరుకు కోసం బయుటికి వెళ్లింది. దీంతో వడదెబ్బకు గురై వుృతి చెందింది
ఇప్పగూడెం(స్టేషన్‌ఘన్‌పూర్): మండలంలోని ఇప్పగూడెంకు చెందిన బట్టమేకల ఆగమ్మ (90) వడదెబ్బతో మృతిచెందింది. ఆమె ఆది వారం ఉదయం అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందింది.
నెల్లికుదురు : మండలంలోని వావిలాల గ్రా మానికి చెందిన ఎరుకొండ పరమేష్ (23) వడ దెబ్బతో మృతిచెందాడు. పరమేష్ గౌడ కుల స్తులకు కథలు చెప్పుకుంటూ జీవనం సాగి స్తుంటాడు. ఈ క్రమంలో కతలు చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో ఆదివారం వడ దెబ్బకు గుైరె అస్వస్థతకు గురయ్యూడు. చికిత్స నిమిత్తం 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
డోర్నకల్: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని దాన్యా తండాకు చెందిన కేలోతు హరి(60) వడ దెబ్బతో మృతి చెందాడు. హరి కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు.
లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామంలో మబ్బు సిద్దయ్య (55) వడదెబ్బతో మృతి చెందాడు. సిద్దయ్య ఇంటి వద్ద ఇంకుడు గుంత తీస్తుండగా తీవ్రమైన ఎండతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.
మన్‌సాన్‌పల్లి(బచ్చన్నపేట): మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన శాకంపల్లి మల్లారెడ్డి (75) వడదెబ్బతో మృతిచెందాడు. మల్లారెడ్డి రోజూ ఉదయం, సాయంత్రం బావి వద్దకు వెళ్లి వచ్చే వాడు. రోజూ మాదిరిగానే ఆయన ఆదివారం బావి వద్ద వెళ్లి వచ్చి అస్వస్థతకు గురి కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకపోతుండగానే మృతి చెందాడు.
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
Published Mon, May 2 2016 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM
Advertisement