భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మేర కు ఎండతీవ్రత కారణంగా శనివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ఆరుగురు వడదెబ్బకు గురై మృతిచెందారు.
మద్దూరు : మండల కేంద్రానికి చెందిన ఇట్టబోరుున సిద్ధిరాములు (68) వడదెబ్బతో మృతి చెందాడు. ఇంటివద్ద ఉంటున్న ఆయన వడగాలులకు తీవ్ర కు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
గుండ్రాతిమడుగు (కురవి) : మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) గ్రామానికి చెందిన కుంచం వెంకటేశ్వర్లు(49) వడదెబ్బతో మృతి చెందాడు. పని నిమిత్తం బయటకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
మడికొండ : హన్మకొండ మండలంలోని మడికొండ గ్రామానికి చెందిన కొలిశెట్టి నర్సమ్మ(64) వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం కూలీ పనులకు వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ములుగు : మండలంలోని కాసీందేవిపేటకు చెందిన సల్లూరి రవి (42) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి శుక్రవారం ఉదయం కూలీపనికి వెళ్లాడు. అరుుతే ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్‌కు చెందిన గుమస్తా వడికిచెర్ల రాజన్‌బాబు (52) వడదెబ్బతో మృతి చెందాడు. రాజన్‌బాబు మూడు రోజుల క్రితం తన కూతురు వివాహం చేశాడు. అరుుతే ఆ సమయంలో పెండ్లి పనుల్లో భాగంగా ఎండలో తిరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పరిధిలోని తూర్పుకోటకు చెందిన వ్యవసాయ కూలి మేకల కుమార్(38) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోజు మాదిరిగా భార్యతో కలిసి కూలీకి వెళ్లిన ఆయన సాయంత్రం వడదెబ్బకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. కాగా, శనివారం ఉదయం కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు.
వడదెబ్బకు ఆరుగురి మృతి
Published Sun, May 1 2016 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement