
వికటించిన ‘మధ్యాహ్న’ భోజనం
* 33 మంది విద్యార్థులు, ఇద్దరు ఏజెన్సీ నిర్వాహకుల అస్వస్థత
* చెర్వుఅన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘటన
* ఆస్పత్రికి తరలింపు.. అందరూ క్షేమమే
కట్టంగూర్ : మధ్యాహ్న భోజనం వికటించి 33 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఎజెన్సీ నిర్వాహకులు అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటన మండలంలోని చెర్వుఅన్నారం ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మధ్యాన్న భోజన ఏజె న్సీ నిర్వాహకులు రోజు మాదిరి గా విద్యార్థులకు మెనూ ప్రకారం కోడి గుడ్డుతో భోజనం వడ్డించారు. అన్నం తిన్న విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో 6 నుంచి 10 వ తరగతికి చెందిన విద్యార్థులు కడుపునొప్పి, తలనొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు.
ఇది గమినించిన పాఠశాల హెచ్‌ఎం యోగేంద్రనాథ్ 108 వాహనంలో19 మందిని నకిరేక ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇళ్లలోకి వెళ్లిన వారు కూడా వాంతులు చేసుకోవటం తో 14 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఎజెన్సీ నిర్వహకులను ఆస్పత్రికి తరలించా రు. ఆస్పత్రిలో 22 మంది బాలికలు, 11 మం ది బాలురు, వంటచేసే ఇద్దరు మహిళలకు వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న డీఈఓ విశ్వనాథరావు, జెడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీపీ కొండ లింగస్వామి, సర్పంచ్ నంధ్యాల రమాదేవి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ గుండగోని రాము లు, తహసీల్థార్ ప్రమీల, ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్, వనం లక్ష్మిపతి, ఊట్కూరి ఏడుకొం డలు విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.