
తమన్నా
‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మీ పాత్రలో చికెన్ లవర్‌గా తమన్నా కనిపించారు. రోజులో ఏదో ఓ టైమ్‌లో మహాలక్ష్మీ చికెన్ లాగించాల్సిందే. ఆ పాత్రలానే తమన్నా రియల్ లైఫ్‌లో కూడా బీభత్సమైన నాన్ వెజ్ లవర్ అట. కానీ కొన్ని రోజుల పాటు మాంసాహారం ముట్ట కూడదని ఒట్టు పెట్టుకున్నారట. ఎందుకూ..? ఏదైనా దేవుడికి మొక్కా? కాదు. పాత్ర కోసం ఫిట్‌నెస్‌లో భాగమైన డైటా? కాదు.. కాదు. మరి ఎందుకూ అంటే.. తను ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కోసమట. తమన్నా పెట్ పేరు పెబ్బల్.
ఈ మధ్యన కొంచెం అస్వస్థతకు గురైయిందట. పెబ్బల్ అలా బాధపడుతుంటే చూడలేకపోయారట తమన్నా. పెంపుడు కుక్కపిల్ల త్వరగా కోలుకునేందుకు తనకు బాగా నచ్చినదానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దాంతో తనకు కొన్ని రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, తమిళంలో ‘దేవి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.