వికటించిన హాస్టల్ ఫుడ్
విషాహారం తినడంతో 30 మందికి తీవ్ర అస్వస్థత
రుయాకు తరలింపు, కోలుకుంటున్న నర్సింగ్ విద్యార్థినులు
కొందరిని డిశ్చార్జి, మరో పది మంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు
తిరుపతి కార్పొరేషన్ : హాస్టల్ యాజమాన్యం నిర్వాకంతో 30 మంది నర్శింగ్ విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. హాస్టల్‌లో విషాహారం తినడంతో వికటించింది. బాధిత విద్యార్థినుల కథనం మేరకు.. తిరుపతి వెస్ట్ చర్చి వెనుక ఉన్న సప్తగిరి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులకు అదే క్యాంపస్‌లోనే వసతి గృహం ఉంది. అక్కడ 90 మంది విద్యార్థినులు ఉంటున్నారు. సోమవారం ఉదయం వారికి పెరుగన్నం, ఆవకాయ వడ్డించా రు. ఓ విద్యార్థినికి అందులో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. అప్పటికే 40 నిమిషాలు గడవగా టిఫిన్ తిన్న విద్యార్థినులకు కళ్లు తిరగడం, తలనొప్పి రావడంతోపాటు వాంతులు అయ్యాయి. వెంటనే సహచర విద్యార్థినులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించా రు. ఈలోగా సహచర విద్యార్థినులే కొం దరిని ఆటోల్లో రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్సలు అం దించారు. నిమిషాల వ్యవధిలో 30 మం ది రుయాలో అడ్మిట్ కావడంతో ఎమెర్జెన్సీ వార్డు విద్యార్థినులతో నిండిపోయింది. వైద్యం పొందుతున్న బాధితులను చూసిన మిగిలిన విద్యార్థినులు బోరున విలపించడంతో వైద్య సిబ్బంది సైతం టెన్షన్ పడ్డారు. ఏం జరిగిందో మీడియాకు వివరిస్తున్న బాధిత నర్సిం గ్ విద్యార్థినులను చెప్పద్దంటూ హాస్టల్ సిబ్బంది ఒత్తిడి చేయడం కనిపించింది.
అస్వస్థతకు గురైన విద్యార్థినులు వీరే..
సుభాషిణి(19), హిరణ్య (20), ముని (19), సంధ్య(19), షమి(19), పార్వతి (20), పూర్ణిమ(18), శరణ్య(19), రేవ తి(23), కృష్ణవేణి(18), ఫత్తాజ్(19), రుక్మిణి(19), దీపిక(21), కళ్యాణి (21), నాగమణి(19), లోకేశ్వరి(19), శివగామి(19), శరీష(19) వీరితోపాటు మరో 12 మంది ఉన్నారు.
ఊరగాయలోకి బల్లి ఎలా వచ్చింది..
జరిగిన ఘటనపై హాస్టల్ సిబ్బంది నీరజను ప్రశ్నించగా ఏడాది క్రితం సొంతం గా మామిడి కాయ ఊరగాయ చేశామ ని, దానినే విద్యార్థినులకు వడ్డించామని తెలిపారు. అందులోకి చచ్చిన బల్లి ఎలా వచ్చిందో తెలియదన్నారు. పాచిపోయి న అన్నంలో పెరుగు కలిపి పెట్టారని, అందులోకి ఊరగాయ వడ్డించగా చని పోయిన బల్లి కనిపించిందని విద్యార్థిను లు తెలిపారు. 30 మంది నర్శింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురై రుయాలో వైద్యం పొందుతుంటే అటు కళాశాల యాజామాన్యం కాని, జిల్లా వైద్యాధికారులు, ఆఖరికి కలెక్టర్ సైతం వీరి ఆరోగ్యం పట్ల పట్టించుకోక పోవడం దారుణం. మధ్యాహ్నం 3గంటల వరకు విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించి, ఆపై డిశ్చార్జి చేశారు.