నా వల్ల కావడం లేదు! | Alia Bhatt Illnesses with sunstroke | Sakshi
Sakshi News home page

నా వల్ల కావడం లేదు!

Published Fri, Jun 5 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

నా వల్ల కావడం లేదు!

నా వల్ల కావడం లేదు!

 ‘‘ఈ సూర్యభగవానుడు ఉన్నాడే భగభగ మండిపోతున్నాడు. ఈ ఎండలు తట్టుకోవడం నావల్ల కావడంలేదు బాబూ’’ అని ఆలియా భట్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  పాపం ఎండల కారణంగా ఈ సుకుమారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారట. ఆ విషయం గురించి ఆలియా చెబుతూ - ‘‘అదేంటోనండి ఎంత నీరసంగా ఉన్నా కెమెరా ముందుకెళ్లగానే నాలో ఎక్కడలేని ఉత్సాహం ముంచుకొచ్చేస్తుంది. ఒంట్లో నలతగా ఉన్నా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నా. దానివల్ల కొంచెం ఉపశమనంగా అనిపించింది’’ అన్నారు. ఎండలను తట్టుకోవడానికి ఏం చేస్తారు? అనే ప్రశ్న ఆలియా ముందుంచితే - ‘‘బయటికెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటా. నెత్తికి టోపీ కంపల్సరీ. ఈ సీజన్‌లో రోజుకి కనీసం 5 లీటర్ల నీళ్లు తాగుతా. ఫ్రూట్స్ ఎక్కువగా తింటా. అలాగే, నిమ్మరసం తప్పనిసరి. సబ్జా గింజలు నానబెట్టి, ఆ నీళ్లు తాగుతా. ఇలాంటివన్నీ తీసుకున్నా ఎండలు తట్టులేకపోతున్నా. కానీ, కొంతలో కొంత చల్లగా ఉండొచ్చు కదా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement