ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు! |AR Rahman Buys New Lamborghini Urus S Super SUV, Know Price And Other Details Inside - Sakshi
Sakshi News home page

AR Rahman Lamborghini Car: ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు!

Published Sat, Sep 23 2023 10:12 AM | Last Updated on Sat, Sep 23 2023 12:53 PM

AR Rahman New Lamborghini Urus Price And Details - Sakshi

ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలామందికి తెలుసు. సింగర్, సాంగ్స్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే చాలామందికి తెలిసిన ఇతనికి కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇటీవల ఇటలీ బ్రాండ్ కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏఆర్ రెహమాన్ ఇటీవల 'లంబోర్ఘిని ఉరుస్ ఎస్' సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ. 4.18 కోట్లు అని తెలుస్తోంది. తెలుపు రంగులో కనిపించే ఈ కారు చెన్నైలోని డిటైలింగ్ స్టూడియో వద్ద కనిపించింది. అయితే ఈ కారు ఎప్పుడు కొన్నారని విషయం మాత్రం స్పష్టంగా వెల్లడికాలేదు.

లంబోర్ఘిని ఉరుస్
లంబోర్ఘిని ఉరుస్ ఎస్ అనేది బ్రాండ్ లైనప్‌లో రెండవ మోడల్. మొదటిది ఉరస్ పెర్ఫార్మంటే. ఉరుస్ ఎస్ సబ్బియా, నెవ్, టెర్రా అనే మూడు మోడ్‌లతో లభిస్తుంది. పెర్ఫార్మంటే మాత్రం ఆఫ్-రోడ్ మోడ్‌ పొందుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో 666 బిహెచ్‌పి పవర్ & 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

ఇదీ చదవండి: భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి?

లంబోర్ఘిని ఉరస్ ఎస్‌ కలిగిన సెలబ్రిటీల జాబితాలో ఏఆర్ రెహమాన్ మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, రోహిత్ శెట్టి, బాద్షా, రణవీర్ సింగ్, రోహిత్ శర్మ, రజనీకాంత్, కార్తీక్ ఆర్యన్, ఆకాష్ అంబానీ, జూనియర్ ఎన్టీఆర్, జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement