బాబూ.. మీ తమ్ముడెక్కడ ఉన్నాడో చెప్పు! ఆయనకు స్లో పాయి­జన్‌ ఇచ్చి | Madhusudan Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబూ.. మీ తమ్ముడెక్కడ ఉన్నాడో చెప్పు! ఆస్తికోసం ఆయనకు స్లో పాయి­జన్‌ ఇచ్చి..

Published Mon, Aug 7 2023 4:25 AM | Last Updated on Mon, Aug 7 2023 9:31 AM

Madhusudan Reddy fires on Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి: ‘చంద్రబాబూ.. వైఎస్సార్‌ కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పగలవా? ఆస్తి కోసం నారా రామ్మూర్తినాయుడుకి స్లో పాయి­జన్‌ ఇచ్చి బయటకు రాకుండా దాచి పెట్టలేదా?’.. అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్, మంత్రి పెద్దిరెడ్డి, తనపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆదివారం మీడియా సమావేశంలో మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

శ్రీకాళహస్తిలో చంద్రబాబు, బొజ్జల సు«దీర్‌ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. ‘శివుడి సాక్షిగా చెబుతున్నా.. నాలుగేళ్ల అభివృద్ధి, నలభై ఏళ్లు అభివృద్ధిపై చర్చిద్దాం రండి..  దమ్ము ధైర్యం ఉంటే.. శ్రీకాళహస్తి శివయ్య సన్నిధిలో ప్రమాణం చేద్దాం’.. అని సవాల్‌ విసిరారు. శ్రీకాళహస్తిలో పవన్‌తో అరాచకాలు చేయించాలని బాబు కుట్ర­­చేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచు­­కున్న బాబే బాలాజీ రిజర్వాయ­ర్‌ ముందు సెల్ఫీ దిగుతున్నారని ఆరోపించారు.  

కిమ్‌ లాంటి వాడు చంద్రబాబు 
తనకు  ప్రత్యర్థి ఉండకూడదని తన అంకుల్‌ని, సోదరుడ్ని కిమ్‌ చంపితే.. సీఎం పదవి, పార్టీని లాక్కునేందుకు పిల్లనిచి్చన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూడా కిమ్‌ లాంటి వాడేనని బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement