ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా: బురిడీ బాబా | wanted to kill madhusudan reddy family, reveals fake baba siva | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా: బురిడీ బాబా

Published Sat, Jun 18 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా: బురిడీ బాబా

ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా: బురిడీ బాబా

డబ్బు కోసం తాను మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని చంపాలనుకున్నానని బురిడీ బాబా శివ వెల్లడించాడు. బంజారాహిల్స్ పోలీసుల విచారణలో అతడీ విషయం చెప్పాడు. తనకు శ్రీనివాసరెడ్డి, దామోదర్ సహకరించినట్లు తెలిపాడు. పూజలో పెట్టిన రూ. 1.30 కోట్లను పది కోట్ల రూపాయలుగా చేస్తానని వాళ్లను నమ్మించానన్నాడు.

మధుసూదన్ రెడ్డిని తనకు మొదట్లో పరిచయం చేసిన మోహన్‌రెడ్డి.. తన వద్ద రూ. 20 వేలు తీసుకున్నాడని చెప్పాడు. రైస్ పుల్లింగ్, డబ్బును డబుల్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ పేర్లతో తాను ఇన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించాడు. దొంగబాబా శివను ఐదురోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును బంజారాహిల్స్ పోలీసులు కోరారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement