
వీరప్పన్ ఇతివృత్తంతో ఇలక్కు
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో మరో చిత్రం తెరపైకి రానుంది. ఇలక్కు పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు పెరుసు చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. సిరిళ, మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర ఆడియోను థియేటర్ల సమ్మేళం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఆవిష్కరించారు. గిల్డ్ మాజీ అధ్యక్షుడు రుక్మాంగదన్, నటుడు విన్సెంట్ అశోకన్, పెప్సీ అధ్యక్షుడు శివ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకోవడానికి పోలీసు అధికారి విజయ్‌కుమార్ పన్నిన పథకాన్ని అమలు పరచిన మరో పోలీసు అధికారి చర్యలే ఇలక్కు చిత్ర ఇతివృత్తం అన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.