వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిక | so many people and leaders join to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిక

Published Sat, Feb 4 2017 1:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిక - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిక

శ్రీకాళహస్తి రూరల్‌: మండలంలోని ఇనగలూరు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇనగలూరు గ్రామంలో యువ వ్యాపారవేత్త మల్లంపల్లి శివకుమార్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేసి 127 మంది అనుచరులతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ముఖ్యుల్లో మల్లంపల్లి ప్రభాకర్‌రెడ్డి, మల్లంపల్లి ఈశ్వర్‌రెడ్డి, మల్లంపల్లి సుబ్బరామిరెడ్డి, దూడల అనీల్‌రెడ్డి, జడపల్లి వెంకటముని, సుబ్బరాయలు, రాఘవులు, దేవరాజులరాయల్‌ కుటుంబీకులు, ఆంజనేయపురానికి చెందిన  సుబ్బరాయలు చంద్ర, శేషయ్య, వాసు, శ్రీను, రాజేష్, రవి ఉన్నారు.

మాజీ సర్పంచ్‌ నేతృత్వంలో...
 బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్,  బీసీ టీడీపీ మండల సీనియర్‌ నాయకుడు పులికొండ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 82 మంది అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో ప్రముఖులు చిన్నయ్య, చెంచురమణయ్య, చింతయ్య, సురేష్, పొండయ్య, కృష్ణమూర్తి, వెంకటమునిలక్ష్మయ్య, పెంచలయ్య, చిన్నబ్బయ్య, చెంచుకృష్ణ, వెంకటయ్య, చిరంజీవి, మూగయ్య, శేషాధ్రి తదితరులు ఉన్నారు. పాతగుంట గ్రామానికి చెందిన మనవాసి శ్రీనివాసులు యాదవ్, భీమవరం గ్రామానికి చెందిన చెరుకూరు చిన్నంనాయుడు అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు.

టీడీపీ ఆధిపత్యానికి ఇక చెక్‌
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇనగలూరు గ్రామం ఆ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఉన్న నాయకుడు మంత్రికి సమీప బంధువు కావటమేగాక తిరుగులేని ఆధిపత్యం చలాయించేవారు. ఎన్నికల సమయంలో ఇక్కడ వేరే పార్టీకి ఏజెంట్‌ను పెట్టాలన్నా దొరికేవారు కాదు. దీనికి చెక్‌ పెట్టాలనుకుని యువతంతా ఏకమై వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement