నెల్లూరు: నెల్లూరు జిల్లా తడ చెక్‌పోస్ట్ వద్ద విద్యుద్ఘాతంతో కంటెయినర్ లారీ తగలబడిపోయింది. ఐరన్ షీట్స్‌తో లక్నో నుంచి చెన్నై వెళ్తున్న లారీని డ్రైవర్ తడ చెక్‌పోస్టు వద్ద ఆపి కిందకు దిగారు. ఈ సమయంలో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ కింద ఉన్న డీజిల్ ట్యాంక్‌ను తాకడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి.
కొద్దిక్షణాల్లో లారీ పూర్తిగా దగ్ధమయింది. కంటెయినర్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. మంటలను ఆర్పివేసేందుకు తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి ఫైరింజన్లు వచ్చినా అప్పటికే పూర్తిగా లారీ బూడిదయింది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు, చుట్టుపక్కలవారు ప్రాణభయంతో పరుగులు తీశారు.
(తడ)
మంటల్లో కంటైనర్
Published Sun, May 17 2015 10:30 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement