ఘోర రోడ్డు ప్రమాదం
Published Sat, Dec 3 2016 7:22 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజానగరం మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు దివాన్ చెరువు వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement