
కంటైనర్ బోల్తా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
బిస్కెట్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తాకొట్టింది.
హైదరాబాద్: బిస్కెట్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తాకొట్టింది. వేగంగా వెళ్తున్న కంటైనర్ లక్డీకాపూల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది.
మెహిదీపట్నం నుంచి గ్లూకోస్ బిస్కెట్ల లోడ్‌తో ఈ కంటైనర్ మహావీర్ హాస్పిటల్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో ఉండే ఈ రోడ్డులో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, ఉదయం వరకు ఈ కంటైనర్‌ను తొలగించలేదు. దీన్ని తొలగించేందుకు 40 టన్నుల క్రేన్ అవసరం ఉన్నందున అది వచ్చేవరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.