రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్ | Fire accident in container | Sakshi
Sakshi News home page

రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్

Published Tue, May 26 2015 9:39 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in container

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంటైనర్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి కూలర్లతో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement