నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు వద్ద టైర్ల కంటెయినర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది.
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు వద్ద టైర్ల కంటెయినర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వైపు 300 ఎంఆర్‌ఆఫ్ టైర్ల లోడుతో వెళుతున్న కంటెయినర్ సోమవారం సాయంత్రం ఉప్పలపాడు వద్దకు వచ్చేసరికి ప్రమాదం సంభవించింది. కంటెయినర్ డ్రైవర్ ముందున్న బస్సును అధిగమించబోయాడు.
ఈ ప్రయత్నంలో కంటెయిన్ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ డివైడర్‌కు బలంగా తగలడంతో పేలిపోయి మంటలు లేచాయి. కంటెయినర్‌లో టైర్లు ఉండడంతో స్వల్ప వ్యవధిలోనే లారీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.