తమిళనాడులో ఘోర రోడ్డు ప‍్రమాదం
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విల్లుపురం జిల్లా ఆచనూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులంతా చెన్నై వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.