ప్రత్తిపాడు : జాతీయ రహదారిపై ధర్మవరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఖాళీ కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఖాళీ కంటైనర్ డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసుల కథ నం మేరకు .. భీమవరం నుంచి రొయ్యలను తీసుకు వచ్చేం దుకు విశాఖ నుంచి ఖాళీ కంటైనర్ బయలుదేరింది. ధర్మవరం ఎన్‌హెచ్‌పై జెడ్పీ హైస్కూల్ జంక్షన్ సమీపానకొచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. లారీ వెనుక చక్రాలు ఊడిపోయి, దాని కిందకు కంటైనర్ ముందుభాగం దూసుకుపోయింది. ఈ సంఘటనలో విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సందులూరు గ్రామానికి చెందిన కంటైనర్ డ్రైవర్ కాటపల్లి శివ (23) కేబిన్‌లోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. విజయనగరం జిల్లా జామి మం డలం కొత్తవలస గ్రామానికి చెందిన కంటైనర్ రెండో డ్రైవర్ బాజిరెడ్డి వెర్రినాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెర్రినాయుడును కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేబిన్‌లోనే నరకయాతన
రోడ్డు ప్రమాదంలో లారీని ఢీకొన్న ఖాళీ కంటైనర్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించి, చివరకు మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు లారీ కిందకు కంటైనర్ కేబిన్ దూసుకుపోయి, నుజ్జునుజ్జయ్యింది. కేబిన్‌లోనే విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం సందులూరు గ్రామానికి చెందిన డ్రైవర్ కాటపల్లి శివ ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటకు పైగా మృత్యువుతో పోరాడి, చివరకు ప్రాణాలొదిలాడు. పోలీసులు, హైవే మెయిన్‌టినెన్స్ సిబ్బంది డ్రైవర్‌ను కేబిన్ నుంచి వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రేన్‌ను రప్పించి, దాని సహాయంతో లారీ కింద ఇరుక్కుపోయిన కేబిన్ నుంచి డ్రైవర్ మృతదేహాన్ని మూడు గంటల తరువాత గానీ వెలికి తీయలేకపోయారు.
లారీని ఢీకొట్టిన కంటైనర్
Published Sat, Aug 1 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement