
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల :ఎరక్కపోయి తలపెట్టి ఇరుక్కుపోయిందిఈ గేదె. ద్వారకాతిరుమల తూర్పువీధిలో సోమవారం కనిపించిన ఈ దృశ్యాలుస్థానికులను కాసేపు ఆందోళనకు గురిచేశాయి. కుడితి కోసం డబ్బాలో తలపెట్టినఈ గేదె.. ఇరుక్కుపోయింది. డబ్బా ఎంతసేపటికీ రాకపోవడంతో రోడ్డుపై హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఎవరూ డబ్బా తీసేందుకు సాహసించలేదు. ఆఖరికి ఇద్దరు యువకులు చాకచక్యంగాగేదె తల నుంచి డబ్బాను తీశారు. దీంతో బతుకు జీవుడా అంటూ గేదె పరుగులు పెట్టింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.