సాయం కోసం వెళ్లి మృత్యులోగిలికి.. | driver died in lorry accident | Sakshi
Sakshi News home page

సాయం కోసం వెళ్లి మృత్యులోగిలికి..

Published Thu, Nov 13 2014 12:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

driver died in lorry accident

శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై ఆగి ఉన్న ఓ కంటెయినర్‌ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యా యి. ఆర్‌జీఐఏ ఠాణా ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగూడ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై ఉదయం 6.30 గంటల సమయంలో ఓ కంటెయినర్ మరమ్మతుకు గురవడంతో రోడ్డుపై నిలిపారు.

అదే సమయంలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓ లారీని సాయం కోసం కంటైనర్ డ్రైవర్ ఆపాడు. వాహనం చెడిపోయింది.. పనిముట్లు ఇవ్వాలని కోరాడు. దీంతో లారీ డ్రైవర్ షేర్‌ఖాన్(45), క్లీనర్ ఇస్మాయిల్‌ఖాన్(27)లు తమ లారీని కొద్ది ముందుకు తీసుకెళ్లి ఆపారు. అనంతరం కిందికి దిగి పనిముట్లతో కంటెయినర్‌కు మరమ్మ తు చేయసాగారు. అదే దారిలో శంషాబాద్ వైపు వస్తున్న మరో లా రీ వెనుక నుంచి కంటెయినర్‌ను వేగంగా ఢీకొంది.

దీంతో కంటె యినర్  బోల్తాపడింది. దానికి మరమ్మతు చేస్తున్న షేర్‌ఖాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో ఇస్మాయిల్‌ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కంటెయినర్‌కు సంబంధించిన డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి. కంటెయినర్‌ను ఢీకొన్న లారీ డ్రైవర్ వెంకటరమణ కాలికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసు లు షేర్‌ఖాన్ మృతదేహానికి స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు నగరంలోని బోరబండ వాసి అని పోలీసులు తెలిపారు. ఈమేరకు ఆర్‌జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement