శంషాబాద్ సమీపంలోని ఔటర్‌రింగు రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం షెవర్లే క్రూయిజ్ కారు మంటల్లో చిక్కుకుంది.
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఔటర్‌రింగు రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం షెవర్లే క్రూయిజ్ కారు మంటల్లో చిక్కుకుంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరూ వెంటనే కారు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పూర్తిగా మంటలు వ్యాపించడంతో కారు కాలిపోయింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.