![నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81480454086_625x300.jpg.webp?itok=kiZyG1y8)
నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు
• కంటెయినర్‌ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు
• ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
జడ్చర్ల టౌన్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురా లిని తప్పించబోరుున టూరిస్ట్ బస్సు.. ఆగి ఉన్న కంటెరుునర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో బస్సులోని ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి స్వల్ప గాయాల య్యారుు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. కేరళ రాష్ట్రం మళక్‌పురం జిల్లా పెరుంతల్‌మన్నలోని అల్‌షిఫా ఫార్మా కాలేజీకి చెందిన 28 మంది విద్యార్థులు, ముగ్గురు ట్యూటర్లతో కలిసి విజ్ఞాన యాత్ర కోసం పొంపి ట్రావెల్స్ బస్సులో సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.
బస్సు డ్రైవర్ హకీం ఉదయం 8 గంటల సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోరుు పక్కనే నిలిపి ఉన్న కంటెరుునర్‌ను ఢీకొట్టాడు. దీంతో కంటెరుునర్ పైపులు 8 అడుగుల మేర టూరిస్టు బస్సులోకి చొచ్చుకుపోయారుు. ప్రమాదంలో బస్సులో నిద్రిస్తున్న మన్నార్‌కాడ్ గ్రామానికి చెందిన కండక్టర్ రాజీవ్ (30), పెరినింతమన్నకు చెందిన క్లీనర్ అల్మీన్ (28) పైపుల్లో ఇరుక్కుపోరుు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ హకీం తీవ్ర గాయాలతో బయటపడి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు.
ఆరుగురికి తీవ్ర, 25 మందికి స్వల్ప గాయాలయ్యారుు. కొందరు క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రికి, మరికొందరిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ గంగాధర్ ఘటనాస్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను వేరుచేసి మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.