న్యూయార్క్: అమెరికా నేతృత్వంలో ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత కూడా ఎర్రసముద్రంలో తొలిసారి ఓ నౌకపై దాడి జరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మెర్స్క్ హాంగ్‌జౌ అనే వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. హాంగ్‌జౌ నౌక డెనార్క్‌కు చెందిన నౌక. అయితే.. దాడి జరిగినప్పటికీ ప్రయాణానికి ఇబ్బంది కలగలేదని అమెరికా తెలిపింది
ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ పేరిట అమెరికా, ఫ్రాన్స్, యూకేల నౌకలు ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను అమెరికా నేతృత్వంలో చేపట్టాయి. డెన్మార్క్ కూడా ఈ కూటమిలో చేరింది. ఈ గస్తీ తర్వాత కూడా ఓ నౌకపై దాడి జరగడం గమనార్హం. అయితే.. ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి శత్రువులకు చెందిన 17 డ్రోన్లను, నాలుగు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి.
ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 1200 వాణిజ్య నౌకలను క్షేమంగా ఎర్ర సముద్రం దాటించామని అమెరికా నేవీకి చెందిన వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్‌జౌపై దాడి జరిగింది.
ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్‌లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది.
ఇదీ చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా
Comments
Please login to add a commentAdd a comment