ఇన్సురెన్స్ కోసం రెండు రోజులు ఆగి..
* వాగులో పడిన కంటెయినర్ వెలికితీత
* అదుపు తప్పి వాగులో పడిన వైనం
* బీమా ఏజెంట్ల సమక్షంలో తంతు
పిడుగురాళ్ళ: పట్టణంలోని ఎర్రవాగు బ్రిడ్జిలో వారం రోజుల కిందట ఓ కంటైనర్ పడిపోయింది. దాని లోపల ఎనిమిది కొత్త కార్లు ఉన్నాయి. అవి దెబ్బతినకుండా జాగ్రత్తగా ఎర్రవాగులో నుంచి బయటకు తీయాల్సివుండడంతో కార్ల యాజమాన్యం ఇన్సూరెన్సు ప్రతినిధుల సమక్షంలో శనివారం కార్ల లోడును బయటకు తీయించింది. కంటైనర్‌ను వాగులోంచి బయటకు తీయడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఇందుకు ఆరు పొక్లెయిన్‌లను ఉపయోగించారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.