కర్ణాటకలో షాకింగ్ ఘటన!
ఉడిపి: ఆవులు తరలిస్తున్నారని ఓ బీజేపీ కార్యకర్తను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ శ్రేణులు అతి కిరాతకంగా కొట్టిచంపారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ పూజారి రెండు ఆవులను టెంపో వాహనంలో తరలిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలకు చిక్కాడు.
ఉడిపిలోని హెబ్రీ ప్రాంతంలో అతని వాహనంపై దాదాపు 20మంది దాడి చేశారు. వారి వద్ద పదునైన ఆయుధాలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ప్రవీణ్ పూజారీ చనిపోయాడని ఉడిపి ఎస్పీ కేపీ బాలకృష్ణన్ తెలిపారు. ఈ కేసులో 17మందిని అరెస్టు చేశామని వివరించారు. తన మిత్రుడు అక్షయ్‌తో కలిసి ప్రవీణ్ టెంపోలో ఆవులు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.