నగరంలోని ఎల్బీనగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శుక్రవారం హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా గొడవకు దిగిన కార్యకర్తలపై మీర్‌పేట్ పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందులో ఒక యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు డీఎస్పీని డిమాండ్ చేశారు.