హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవాన్ని నిరసిస్తూ వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు శుక్రవారం కోఠీలో ఆందోళన చేపట్టారు. తాము ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రేమికుల రోజు పేరిట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగల్పే చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నట్లు నినాదాలు చేశారు. కాగా ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని ఇప్పటికే బజరంగ్ దళ్ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.