మోదీ ‘మిషన్’ కోసం 24 లక్షల మంది
తమ సంస్థలకు మొత్తం 24లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వీరందరిచే దేశమంతటా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతామన్నాయి. ‘నగదు రహిత ఉద్యమం కోసం బజరంగ్ దళ్ త్వరలో 24 లక్షల మందితో మిషన్ ప్రారంభిస్తుంది. ఒక్కొక్కరు పది మందిని కలిసి వారికి ఈ విషయంపై అవగాహన కల్పిస్తారు. దాని వల్ల పొందే ప్రతిఫలాలు కూడా వివరిస్తాయి’ అని విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ చెప్పారు.
ప్రజలంతా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి భయపడుతున్నారని, అపోహలన్నీ తొలగించే బాధ్యతలు తీసుకుంటామన్నారు. గురుదక్షిణ కూడా డిజిటల్ రూపంలోనే ఇస్తున్నారని, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుందని వారు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిలో ఓ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ఉంటే అంతా తేలికైపోతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును విజయవంతం చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల బాధ్యత కూడా అని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.