‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’ | Senior Maoist leader Dunna Kesava Rao | Sakshi
Sakshi News home page

‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’

Published Sat, Apr 2 2016 10:42 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’ - Sakshi

‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’

మాజీ మావోయిస్టు తల్లి వేడుకోలు...
 
పలాస : కొన్నేళ్లుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న తన కుమారుడు దున్న కేశవరావు విడుదలకు ఆంధ్రా పోలీసులు సహకరించాలని మందస మండలం బొడ్డులూరు గ్రామానికి చెందిన దున్న కాములమ్మ వేడుకొంది. ఈ మేరకు కాశీబుగ్గలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.  మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకొని అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావుతో మాట్లాడి కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు.
 
 రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు చూపించి తిరిగి ఒడిశా పోలీసులకు అప్పగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తప్పుడు కేసు పెడుతూ జైలులో హింసిస్తున్నారని, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ప్రస్తుతం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు తన కుమారుడుని తనకు అప్పగించాలని  కోరారు.
 
 ప్రభుత్వాన్ని నమ్ముకొని నా బిడ్డకు సరెండర్ చేయిస్తే చివరకు నాకు దూరం చేశారని, తన కుమారుడిని చూసేందుకు ఒడిశా వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తన బిడ్డ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే తన కుటుంబం మొత్తం చనిపోవాల్సి ఉంటుందని, అందుకు ప్రజాప్రతినిధులు, ఆంధ్రా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు జోక్యం చేసుకొని తన బిడ్డను ఇంటికి పంపించాలని కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement