మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి | Two Naxals killed in encounter with police in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Published Fri, Dec 15 2023 6:32 AM | Last Updated on Fri, Dec 15 2023 6:32 AM

Two Naxals killed in encounter with police in Maharashtra - Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు సీనియర్‌ నేత సహా ఇద్దరు నక్సల్స్‌ చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు.

ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్‌సూర్‌ దళం డిప్యూటీ కమాండర్‌ దుర్గేశ్‌ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement