గోసంరక్షణ పేరుతో దాడులు తగవు | dhadulu tagavu | Sakshi
Sakshi News home page

గోసంరక్షణ పేరుతో దాడులు తగవు

Sep 5 2016 12:27 AM | Updated on Apr 6 2019 9:31 PM

గో సంరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు దళితులపై చేస్తున్న దాడులు వెంటనే విరమించుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌ కోరారు. ఆదివారం స్థానిక లజపతిరాయపేటలో విలేకరులతో మాట్లాడుతూ గో చర్మంతో తయారుచేసిన పాదరక్షలను వినియోగించడం పాపం కాదా అని ప్రశ్నించారు. పాదరక్షలు తయారుచేసే పలు కార్పొరేట్‌ కంపెనీలు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులవే అన్నారు. గోసంరక్షణ కార్యకర్తలు తక్షణం లెదర్

పాలకొల్లు అర్బన్‌ : గో సంరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు దళితులపై చేస్తున్న దాడులు వెంటనే విరమించుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌ కోరారు. ఆదివారం స్థానిక లజపతిరాయపేటలో విలేకరులతో మాట్లాడుతూ గో చర్మంతో తయారుచేసిన పాదరక్షలను వినియోగించడం పాపం కాదా అని ప్రశ్నించారు. పాదరక్షలు తయారుచేసే పలు కార్పొరేట్‌ కంపెనీలు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులవే అన్నారు. గోసంరక్షణ కార్యకర్తలు తక్షణం లెదర్‌ పాదర„ý లు మానాలని సూచించారు. ప్రతి గోసంరక్షణ కార్యకర్త రోడ్లపై తిరుగుతున్న గోవులను దత్తత తీసుకుని సంరక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వి ప్పర్తి ప్రభాకరరావు, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, నాయకులు పార్శి వెంకటరత్నం, నల్లి జయరాజు, తోటె సుందరం తదితరులు పా ల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement