‘సెక్యులరిజం పేరిట దేశాన్ని చీల్చే కుట్ర’ | contravercial comments on asadudin owisi :akarapu kesavaraju | Sakshi
Sakshi News home page

‘సెక్యులరిజం పేరిట దేశాన్ని చీల్చే కుట్ర’

Published Tue, Apr 5 2016 4:15 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

contravercial comments on asadudin owisi :akarapu kesavaraju

హైదరాబాద్ : భారతదేశంలో జీవించాలంటే భారత్ మాతాకీ జై అనాల్సిందేనని వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి ఆకారపు కేశవరాజు అన్నారు. సోమవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛ ముసుగులో భారత్‌కు విద్రోహం అనే అంశంపై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా కేశవరాజు మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేసేం దుకు  సెక్యులరిజం పేరిట కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

తలతీసేసినా భారత్ మాతాకీ జై అనను అని నినదించిన హైదరాబాద్ ఎంపీ అసద్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంఐఎం నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ  ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుం టే.. తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ హెబ్బార్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఏ దేశ పౌరుడైనా ఆ దేశాన్ని ప్రే మించాలి తప్ప ద్వేషించడం తగదన్నా రు. కార్యక్రమంలో ప్రాంత సహప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement