Bharat mataki Jai
-
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
అందరూ భారత్ మాతాకీ జై అనాల్సిందే..
వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్ హైదరాబాద్ : దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ భారత్‌మాతాకీ జై, గోమాతాకీ జై అనాల్సిందేనని, అలా అననివారు దేశం నుండి వెళ్లిపోవాల్సిందేనని వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్ అన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం కోఠి వద్ద జరిగిన హనుమాన్ శోభాయాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశంలో అన్ని వర్గాలవారికి, అన్ని మతాలవారికి సమానహక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ భారతమాతను గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల క్రితం భజరంగ్‌దళ్,వీహెచ్పీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హనుమాన్ జయంతి శోభాయాత్ర నేడు దేశంలోని ప్రతి నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీసు ల తీరు దారుణంగా ఉందని భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై. భానుప్రకాష్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నేతలు గోవింద్‌రాఠి, యమన్‌సింగ్, విమల్‌దాల్మియా, భరత్‌వంశీ, సత్యనారాయణ, రమేష్, వీరేశలింగం, లక్ష్మణ్‌రావు, గిరిధర్, ప్రకాష్ గిరి, అనిల్, కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సెక్యులరిజం పేరిట దేశాన్ని చీల్చే కుట్ర’
హైదరాబాద్ : భారతదేశంలో జీవించాలంటే భారత్ మాతాకీ జై అనాల్సిందేనని వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన్ కార్యదర్శి ఆకారపు కేశవరాజు అన్నారు. సోమవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛ ముసుగులో భారత్‌కు విద్రోహం అనే అంశంపై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా కేశవరాజు మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేసేం దుకు సెక్యులరిజం పేరిట కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తలతీసేసినా భారత్ మాతాకీ జై అనను అని నినదించిన హైదరాబాద్ ఎంపీ అసద్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంఐఎం నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుం టే.. తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ హెబ్బార్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఏ దేశ పౌరుడైనా ఆ దేశాన్ని ప్రే మించాలి తప్ప ద్వేషించడం తగదన్నా రు. కార్యక్రమంలో ప్రాంత సహప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
అవలోకనం మహత్తరమైన మన భారత జాతీయవాదులు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వారి వెంటపడుతున్నారు. వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ లేదా మరే ఇతర ప్రేమా కాదు... విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ఏ విదేశీ పత్రికైనా చూడండి. భారత్ గురించి ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ప్రపంచం భావిస్తోంది కాబట్టి. అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. మహారాష్ట్రలో ఒక ముస్లిం శాసన సభ్యుడ్ని, అతడు ‘‘భారత్ మాతా కీ జై’’ (తల్లి భారతికి విజయం) అనడానికి బదులు ‘‘జై హింద్’’ (భారత దేశానికి విజయం) అనే అంటానని అన్నందుకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రెండు నినాదాల మధ్య ఉన్న తేడా ఏమిటో నాకూ క చ్చితంగా తెలియదు. కానీ అది శిక్షార్హమైందనేది మాత్రం స్పష్టం. భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలని ఉర్దూ రచయితలందరినీ మార్చి 19న కోరారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’(ఎన్‌యూపీయూఎల్), ఉర్దూ రచయితలను దిగువ ప్రకటనపై సంతకం చేయాలని కోరింది: ‘నేను.........ను ........... కొడుకు/కూతురు ,........ శీర్షికగల నా పుస్తకం/పత్రికను ఎన్‌యూపీయూఎల్ ఆర్థిక సహాయ పథకం కింద పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆమోదం పొందాను. ఇందులో భారత ప్రభుత్వ విధానాలకు లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఏ విధమైన వైమనస్యానికి కారణమయ్యేది ఏదీ లేదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ దేని నుంచీ దీనికి ఆర్థిక సహాయం అందలేదు.’’ ఇదీ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపిన విషయం. జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న నాలాంటి వాళ్లకు ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. నాకైతే ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో నేను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయింది. మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు. సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు. టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి దేశాలనూ అందులోకి ఈడ్చారు. రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు. కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది. మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం. మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే. వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే. ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికీ మనకున్నది సరిపోదా? నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..!
నవభారతం నిర్మిద్దాం కలసిరండి ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపు న్యూయార్క్: మది నిండా భారతీయం ఉప్పొంగిన వేళ.. మాతృభూమిని స్మరిస్తూ మువ్వన్నెల్లో మునిగిన తరుణం.. అభివృద్ధి మాంత్రికుడిపైనే ఆలోచనలన్నీ ముసిరిన క్షణాన ప్రవాసులంతా ఉర్రూతలూగిపోయారు. 125 కోట్ల భారతావని ప్రతినిధిగా అమెరికాలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. 21వ శతాబ్దం మనదేనంటూ ఆద్యంతం ఉత్తేజం నింపిన ప్రధానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన భారీ సభలో మోదీ చేసిన ప్రసంగానికి ఆహూతులంతా మురిసిపోయారు. ‘భారత్ మాతాకీ జై’ అని ప్రారంభిస్తూ సహజమైన హావభావాలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా నడిబొడ్డున.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగిన మోదీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. నవరాత్రి ఉపవాసాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆయన నవయువకుడిగా మారిపోయారు. ప్రధాని పలికిన ప్రతి మాటకూ చప్పట్లు మారుమోగాయి. మోదీ నామస్మరణతో మేడిసన్ స్క్వేర్ లోపలాబయటా హోరెత్తిపోయింది. దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది పరోక్షంగా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఆద్యంతం ఉత్సాహభరిత ప్రసంగంతో ఎన్ఆర్ఐలనే కాదు.. అమెరికన్ల మదినీ దోచుకున్నారు. భారత శక్తియుక్తులను, తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే.. మాతృదేశాన్ని అభివృద్ధి చేయడానికి కలిసిరావాలంటూ ప్రవాసులందరికీ ప్రధాని మోదీ పదేపదే పిలుపునిచ్చారు. అట్టహాసంగా ప్రారంభం మేడిసన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్ఆర్ఐలు, అమెరికన్లు భారీగా తరలివచ్చారు. ప్రాంగణమంతా భారతీయత ఉట్టిపడింది. జాతీయ పతాకాలు చేతబూని, మోదీ మాస్క్‌లు, టీషర్ట్లు ధరించి అక్కడికి వచ్చిన వారంతా హంగామా చేశారు. సీట్లన్నీ నిండిపోయి మేడిసన్ స్క్వేర్ మొత్తం కిక్కిరిసిపోయింది. బయట ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భారతీయ నృత్యాలు, పాటలతో కళాకారులు ప్రదర్శనలిచ్చారు. పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. మోదీ ప్రవేశంతోనే హాలంతా ఆయన పేరే మారుమోగిపోయింది. మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్, తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మోదీ ప్రసంగానికి ముందు ప్రఖ్యాత గాయని కవితా కృష్ణమూర్తి జాతీయగీతాన్ని ఆలపించారు. ‘సోదరసోదరీమణులారా’ అని పలకరించిన మోదీ.. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తిగా స్వచ్ఛమైన హిందీలో ఆయన ప్రసంగం సాగింది. ఇప్పుడు ‘మౌస్’తో ఆడుకుంటున్నాం అమెరికాలో స్థిరపడిన భారతీయులను మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. వారి వల్లే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. భారతీయ అమెరికన్లను చూసి దేశం గర్వపడుతోందన్నారు. పాములను ఆడించే దేశంగా ప్రపంచానికి తెలిసిన భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేశారని ప్రస్తుతించారు. ఇప్పుడు మనం ‘మౌస్’తో ఆడుకుంటున్నామని చమత్కరించారు. ‘మీలో చాలా మంది ఓటు వేసి ఉండకపోవచ్చు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మీరంతా సంబరాలు చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఇవాళ ఇక్కడున్నాను. భారత అభివృద్ధిలో మీ పాత్ర ప్రధానమైనది’ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. 15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు.. ‘మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికల్లో ఒకే పార్టీ పూర్తి మెజారిటీతో ఘనవిజయం సాధించింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు. ఓటర్లు వారి అభిప్రాయాన్నే మార్చేశారు. ఎన్నికల్లో గెలవడం కుర్చీ కోసమో.. అధికారం కోసమో కాదు. అది ఒక బాధ్యత. అధికారం చేపట్టినప్పటి నుంచి 15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు. మీతో(ప్రవాస భారతీయులు) పాటు భారతీయులు కూడా దేశం గురించి ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మా ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. వాటిని నెరవేర్చడంలో మేం కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దం మనదే.. 21వ శతాబ్దం ఆసియాదేనని ప్రపంచమంతా అంగీకరించిందని మోదీ అన్నారు. ‘మనది యువ దేశం. 65శాతం మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారే. నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. యువశక్తి, నైపుణ్యాలతో భారత్ వెనక్కితిరిగి చూడాల్సిన పనిలేదు. అభివృద్ధి పథంలో వేగంగా సాగుతుంది’ అని ప్రధాని అన్నారు. ‘ఎవరికీ లేని మూడు ప్రధాన బలాలు భారత్‌కు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, యువశక్తి, డిమాండ్ - ఈ మూడు శక్తులే భారత్‌కు చోదకాలు. అందుకే ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. భారత్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది’ అని మోదీ తెలిపారు. నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది ‘అహ్మదాబాద్‌లో కిలోమీటర్ దూరం ఆటోలో వెళ్లడానికి రూ. 10 ఖర్చవుతుంది. అంగారకుడిని చేరడానికి 65 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. ఇందుకు కిలోమీటర్‌కు 7 రూపాయలే ఖర్చు చేశాం. హాలీవుడ్ సినిమాకయ్యే వ్యయం కన్నా తక్కువలోనే తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపించాం. మన నైపుణ్యానికి ఇదే నిదర్శనం. అపార నైపుణ్యాలు, సామర్థ్యం మనకుంది. వాటితోనే ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. అందుకే నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఎన్ఆర్ఐలకూ పిలుపునిచ్చారు. ఇవే నా లక్ష్యాలు.. మోదీ ఈ సందర్భంగా తన లక్ష్యాలను వివరించారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్, అందరికీ ఇళ్లు, మేకిన్ ఇండియా వంటి పథకాల ఆవశ్యకతను వెల్లడించారు. ‘దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో విస్తరించినప్పటికీ ఇంకా 50 శాతం మంది కుటుంబాలకు ఖాతాలు లేవు. ప్రైవేటుగా రుణాలు తీసుకునే పేదలను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నారు. అందుకే జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికే 4 కోట్ల మందికి ఖాతాలు తెరిచాం. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరుస్తామని చెప్పాం. కానీ జనం ఆ ఖాతాల్లో రూ. 1,500 కోట్లు జమ చేశారు. ఇక తగినన్ని మానవ వనరులు, తక్కువ రేట్లకే ఉత్పత్తి కావాలంటే మీ గమ్యం భారతే. ఇందుకు పాలనా వ్యవస్థను సులభతరం చేస్తున్నాం. భారత భవిష్యత్తు మార్చడానికి మాతో కలిసిరండి’ అని మోదీ పిలుపునిచ్చారు. పనికిరాని చట్టాలను తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రవాసులకు నజరానా.. ప్రవాస భారతీయులకు మోదీ వరాలు ప్రకటించారు. పీఐవో కార్డులు ఉన్నవారికి వీసాల సమస్యలను తొలగించనున్నట్లు తెలిపారు. వారికి జీవితకాల వీసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పీఐవో, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) స్కీములను కలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే భారత పర్యటనకు వచ్చే అమెరికన్లకు వీసా ఆన్ అరైవల్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘గాంధీ’ కూడా ఒకప్పుడు ప్రవాస భారతీయుడే. ఆయన దక్షిణాఫ్రికాలో బారిస్టర్ చదివి దేశానికి సేవ చేయడానికి భారత్‌కు తిరిగొచ్చి వచ్చే ఏడాదికి వందేళ్లు పూర్తవుతుంది. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న ప్రవాసీ భారతీయ దివస్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తాం. మనం కూడా మన మాతృదేశానికి సేవ చేసేందుకు చేతులు కలుపుదాం’ అని ఆయన పిలుపునిచ్చారు. చివరగా.. తనకు అమిత గౌరవాన్ని అందించిన భారతీయ అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులు కోరుకుంటున్న నవభారత్ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం.,. దేశ ప్రజల కోసం.. తన వల్ల సాధ్యమైనదంతా ఎలాంటి ఆపేక్ష లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. భారత్ మాతాకీ జై.. అంటూ ప్రసంగాన్ని ముగించారు. అభివృద్ధి ఉద్యమం రావాలి స్వాతంత్య్రం కోసం ప్రజా ఉద్యమం వచ్చినట్టే ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం రావాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ‘ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులే ఉంటారు. మహాత్ముడు స్వాతంత్య్రోద్యమాన్ని ఎలా ప్రజా ఉద్యమంగా మార్చారో ఇప్పుడు అభివృద్ధి కూడా అలాగే మన ఉద్యమం కావాలి. సుపరిపాలన దిశగా ముందడుగు పడాలి. 125కోట్ల భారతీయులే నా బలం. 2020కల్లా ప్రపంచమంతా ముసలివాళ్లతో నిండుతుంది. అప్పుడు మనమే వారికి మానవ వనరులను అందిస్తాం. యువశక్తిని ఉపయోగించుకుని ప్రపంచాన్నే జయిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. చిన్నవాణ్ని.. చిన్న వారి గురించే ఆలోచిస్తా.. ‘నేను పేదవాణ్ని.. చిన్న వాణ్ని. అందుకే చిన్న ఆలోచనలే చేస్తాను. చిన్న చిన్న వారి కోసం పెద్దపెద్ద పనులు చేస్తాను’ అని మోదీ అన్నారు. దేశంలోని 40 శాతం మంది ప్రజల ఆర్థిక ప్రతినిధి గంగానదేనన్నారు. గంగ ప్రక్షాళన ద్వారా వారందరి జీవితాల్లోనూ మార్పు వస్తుందన్నారు. ‘2019లో గాంధీ 125వ జయంతి జరగనుంది. ఆయనకు ఇష్టమైన పనులు చేద్దాం. 2022కి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దాన్ని ఎలా నిర్వహించాలి. అప్పటి వరకు దేశంలో ఇల్లులేని కుటుంబం ఉండకూడదన్నది నా కల. ఇలాంటి చిన్న చిన్న వాటితోనే దేశం మారుతుంది’ అని పేర్కొన్నారు.