లక్నో: ఉత్తరప్రదేశ్లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంపట్ల అసంతృప్తితో ఉన్న వీహెచ్పీ దేశ వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో రామమందిరాన్ని నిర్మించాలని తాము నిర్ణయించినట్లు వీహెచ్ పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. రామ మహోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 15న శ్రీరామ నవమితో ప్రారంభిస్తామని ఏడు రోజులపాటు ఈ ఉత్సవం కొనసాగుతుందని తెలిపారు.
ఈ రోజుల్లో ప్రతి గ్రామంలో హిందువులు శ్రీరాముడిని కొలుస్తారని చెప్పారు. ఇలా చేసే గ్రామాల సంఖ్య 1.25లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గతంలో దాదాపు య75 వేల గ్రామాల్లో రామనవమి మహోత్సవాలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చి ప్రాదాన్యం సంతరించుకుంది.
'దేశ వ్యాప్తంగా రామమందిరాలు నిర్మిస్తాం'
Published Mon, Jan 11 2016 12:18 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement