వీసీపై వీహెచ్పీ కార్యకర్తల దాడి | Vice-chancellor attacked in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

వీసీపై వీహెచ్పీ కార్యకర్తల దాడి

Published Tue, Sep 16 2014 12:46 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

Vice-chancellor attacked in Madhya Pradesh

ఉజ్జయిన్: జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన వైస్ ఛాన్సలర్ పై విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), భజరంగ్దళ్ కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. విక్రమ్ యూనివర్సిటీ వీసీ జవహర్లాల్ కౌల్ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆయనపై కూడా దాడికి పాల్పడ్డారు.

క్యాంపస్ లోని పలు కార్యాలయాలను ధ్వంసం చేశారు. గాయపడిన కౌల్ ను ఆస్పత్రిలో చేర్చారు. జమ్మూకాశ్మీర్ విద్యార్థులకు మద్దతుగా ప్రకటన చేశారనే ఉద్దేశంతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్ విద్యార్థులకు ఫీజు మాఫీ చేయాలన్న జవహర్లాల్ కౌల్ ప్రకటనకు వ్యతిరేకంగా కాషాయ దళాలు ఆందోళనకు దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement