భోపాల్: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్ చేశారు.
'MP में बनी कांग्रेस सरकार तो नहीं लगेगा बजरंग दल पर बैन'
— News24 (@news24tvchannel) August 16, 2023
◆ बजरंग दल को लेकर दिग्विजय सिंह का बड़ा बयान#BajrangDal | #DigvijayaSingh | @digvijaya_28 pic.twitter.com/VEm9N6E3Sm
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
Comments
Please login to add a commentAdd a comment