
భోపాల్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో 2023 ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల ప్రకారం.. దిగ్విజయ్ సింగ్ శనివారం రత్లాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అది జరగని పక్షంలో 2023 ఎన్నికలే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి ఎలక్షన్స్ కావచ్చు అంటూ వారిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు నిజాయితీగా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. వారి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అలాంటి వారికి కార్యకర్తలు మద్దతివ్వరూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.