
'ఎన్డీయే హయాంలోనే రామమందిర నిర్మాణం'
జలంధర్: ఎన్డీఏ ప్రభుత్వ కాలపరిమితి ముగియక ముందే అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవుతుందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ శుక్రవారం అన్నారు. బీజేపీ దళిత మోర్చ జాతీయ కార్యవర్గ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే రామమందిర నిర్మాణపనులు అయోధ్యలో ప్రారంభమవుతాయన్నారు.
ఈనెల 25 నుంచి రెండురోజులు పాటూ వీహెచ్పీ మార్గదర్శక్ మండల సమావేశాలు హరిద్వార్లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే రామమందిర నిర్మాణం పై తుదినిర్ణయం తీసుకుంటామని సాధ్వి ప్రాచీ చెప్పారు.