'ఆప్ చెత్త రాజకీయాలకు పాల్పడుతోంది' | AAP doing communal politics through its stand on beef row: VHP | Sakshi
Sakshi News home page

'ఆప్ చెత్త రాజకీయాలకు పాల్పడుతోంది'

Published Wed, Oct 28 2015 5:49 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

AAP doing communal politics through its stand on beef row: VHP

ఢిల్లీ: ఢిల్లీలోని 'కేరళ భవన్' బీఫ్ వివాదంలో ఆప్ తీరును వీహెచ్పీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఘటనలో ఆప్ వ్యవహరించిన తీరు దేశంలోని సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేదిలా ఉందని వీహెచ్పీ విమర్శించింది. బుధవారం వీహెచ్పీ జెనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ ఆప్ తీరుపై మండి పడ్డారు. లౌకిక పరమైన రాజకీయాలను ఆప్ మతపరమైన వాటిగా మారుస్తుందన్నారు. ఈ తరహా రాజకీయ విధానాల ద్వారా ఆప్ దేశంలోని సామరస్య పరిస్థితులను దెబ్బతీయలేదన్నారు.


ఢిల్లీ పోలీసులు కేరళ భవన్లోకి ప్రవేశించడాన్ని ఆప్ రాజకీయం చేయడం సరికాదన్న వీహెచ్పీ.. కేరళ భవన్ ఫారెన్ ఎంబసీ కాదని గుర్తు చేసింది. దేశంలోని ఏ ప్రభుత్వ కార్యాలయమైనా చట్టాలను గౌరవించాల్సిందేనని, కేరళ భవన్ ఇందుకు అతీతం కాదనీ వీహెచ్పీ తెలిపింది. ఢిల్లీలోని కేరళ భవన్లోని మెనూలో బీఫ్ వాడుతున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో పోలీసు అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాని డిమాండ్ చేస్తున్న ఆప్ ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement