
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే కేరళలో కూడా ఇళ్ల ధరలు ఏ మాత్రం తక్కువ కాదని ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక పోస్ట్ వెల్లడిస్తోంది.
ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక సోషల్ మీడియా పోస్టులో 4 బీహెచ్‌కే (3500 చదరపు అడుగులు) ఇల్లు ధర రూ. 3 కోట్లు అని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే కేరళలో రియల్ ఎస్టేట్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది నగరానికి దగ్గర ఉందా? దూరంగా ఉందా? అనే వివరాలు వెల్లడించలేదు.
ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
కరోనా తరువాత స్థిర ఆస్తిని కలిగి ఉండాలని.. భూములు, భవనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ ధరలు పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వంటి నగరాల్లో 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ధర సగటున రూ. 2 కోట్లు. 4 బీహెచ్‌కే ధర రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఇల్లు బాగుందని చెబుతుంటే.. మరికొందరు ధర చాలా ఎక్కువని అని పేర్కొంటున్నారు.
4 BHK, 3500 sq ft is what 3Cr gets you in Kerala. pic.twitter.com/oRqSzmWqZg
— Sidharth II सिद्धार्थ (@sidharthgehlot) September 9, 2024