ఇంతవరకు ఎన్నో యాప్‌లు చూశాం. కానీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఉండే యాప్‌లు గురించి వినలేదు కదా. మహిళలు మాత్రమే ధైర్యంగా తమకి నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేలా భద్రతతో కూడిన యాప్‌లు ఇంతవరకు రాలేదు. టూరీజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారు తమ స్నేహితులతో పూర్తి భద్రతతో వెళ్లేలా సరికొత్త యాప్‌ని రంగంలోకి తీసుకువచ్చింది ఓ రాష్ట్రం. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో వారికి టూరిస్టు గైడ్‌గా మహిళలే ఉంటారు. ఇదంతా ఎక్కడ? ఆ యాప్ ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే..
వివరాల్లోకెళ్తే..ఒంటరిగా ఉండే మహిళలు లేదా కేవలం మహిళలు తమ స్నేహితులతో టూర్‌కి వెళ్లాలనుకున్నా.. ఏ మాత్రం భయపడకుండా భద్రంగా వెళ్లేందుకు ఓ సరికొత్త యాప్‌ని తీసుకొచ్చింది కేరళ రాష్ట్రం. ఈ మేరకు కేరళ రాష్ట్రం సందర్శన కోసం మహిళా స్నేహపూర్వక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వారికి టూరిస్ట్ ఆపరేటర్లు, గైడ్‌లుగా మహిళలే ఉండేలా తగిన సౌకర్యాలతో కూడిన మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది కేరళ. అందులో భాగంగానే ఫ్రెండ్లీ టూరిజం విమెన్ ప్రాజెక్టును నోడల్ ఏజెన్సీ అయిన స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ చేపట్టి.. అందుకోసం ఓ యాప్‌ను కూడా సిద్దం చేయమని కోరింది .
ఈ యాప్‌లో సామాజిక సాంస్కతిక అంశాలతో సహా అన్ని స్థాన నిర్ధిష్ట సమాచారం, చిత్రాలు ఉంటాయి. అలాగే కేరళలోని వివిధ ప్రాంతాల విశేషాల గురించి ఆ యాప్‌లోనే ఉంటుంది. రాష్ట్రంలో మహిళా పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ విధాన ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు సొంతంగా లేదా వ్యక్తిగతంగా గుంపులుగా దూర ప్రాంతాలకు వెళ్లడం ఓ ట్రెండ్‌గా మారిన ప్రంపంచంలో మనం జీవిస్తున్నాం అన్నారు. ఈ యాప్ సాయంతో మహిళలు హ్యాపీగా పర్యటించిలే గాకుండా వారికెలాంటి ఇబ్బంది తలెత్తదని మంత్రి రియాస్ ధీమగా చెప్పారు.
సుమారు 1.5 లక్షల మంది మహిళలు..
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మహిళల జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం కాన్సెప్ట్‌కు అనుగుణంగా గతేడాది అక్టోబర్‌లో రియాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చొరవ తోపాటు పర్యాటక శాఖ అనేక రకాల మహిళా స్నేహపూర్వక పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలను విడుదల చేస్తోంది. సుమారు 1.5 లక్షల మంది మహిళలు పాల్గొనే లక్ష్యంతో యూఎన్ మహిళలతో సహా వివిధ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యాటక రంగంలో సుమారు 10 వేల మంది మహిళా వెంచర్ల తోసహా దాదాపు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
యాప్‌లో ఉన్న సౌలభ్యం..
ఈ యాప్‌లో మహిళలకు అనుకూలమైన పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలు, రిసార్ట్‌లు, హోటళ్లు, మహిళా సంస్థలు, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లు, మహిళా టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు హోమ్ స్టేలు, మహిళా టూర్ గైడ్‌ల తదితర అన్ని వివరాలు ఉంటాయి. అంతేగాదు ఈ యాప్‌లో మహిళల నేతృత్వంలోని హస్తకళలు, సావనీర్ ఉత్పత్తి, విక్రయ యూనిట్లు, విశ్రాంతి గదులు, క్యాంపింగ్ సైట్‌లు, లైసెన్స్ హౌస్‌బోట్లు, కారవాన్ పార్కులు, వివిధ ప్రదేశాలలో జాతి వంటకాల యూనిట్లు, పండుగలు, అనుభవపూర్వక సాహస ప్యాకేజీలు వంటి సౌకర్యాలు ఉంటాయి. యాప్‌లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేలా ఈ ఆర్టీ మిషన్ భారీగా కసరత్తు ప్రారంభించింది. ఆర్టీ మిషన్ చేపట్టిన ఫ్రెండ్లీ విమెన్ టూరిజం ప్రాజెక్టు కింద సుమారు 1800 మంది మహిళలు వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన మహిళలకి జూలై నుంచి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుంది.
(చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్... ఎక్కడికి వెళ్లడం సులభం? ఎంత ఖర్చవుతుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment