ప్రవీణ్ తొగాడియా, వీఎస్ కోక్జె
గుర్గావ్: గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తొగాడియా 2011 నుంచి వీహెచ్‌పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. వీహెచ్‌పీ కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్‌పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment