praveen thogadia
-
ఎన్నికల లోపే రామమందిర నిర్మాణం
లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తీసుకురానుంది. దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సోమవారం ఆయోధ్యను సందిర్శించారు. అక్కడ నిర్వహించిన శాంతి సమ్మెళనంలో సీఎంతో సహా పలువులు బీజేపీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల లోపు రామమందిర నిర్మాణం ప్రారంభించి ఎడాది లోపే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణంపై ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోకూడదని, ప్రణాళిక ప్రకారమే ఆయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థ అదేశాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ ఎంపీ, రామ్ విలాస్ వేధాంతి మాట్లాడుతూ.. మొగల్ చక్రవర్తి బాబార్ ఎవ్వరి అనుమతులు లేకుండా రామమందిరాన్ని కూల్చివేశాడని, 1992 బాబ్రీ మసీద్ కూడా అదే విధంగా కూల్చీ వేయబడిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల లోపే రామమందిర నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నేడు ఆయోధ్యను సందర్శించనున్నారు. బీజేపీ కావాలనే రామమందిర నిర్మాణం అలస్యం చేస్తోందని తొగాడియా గతంలో పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే. -
అయోధ్య సందర్శనకు సీఎం యోగి
లక్నో : 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి తెరపైకి రానుంది. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. వీహెచ్‌పీ నుంచి తొగాడియాను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని తొగాడియా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కావాలనే రామమందిర నిర్మాణాన్ని ఆలస్యం చేస్తోందని పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఇదిలావుండగా యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిమ్ రిజ్వి ఆదివారం నాడే ఆయోధ్యను సందర్శించి రామమందిర నిర్మాణం కొరకు పదివేల రూపాయల విరాళం అందజేశారు. దేశంలో కొంతమంది రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని, వారు దేశద్రోహులతో సమానమని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం కచ్చితంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రతిపక్షాలన్ని జట్టు కడుతున్న నేపథ్యంలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎలాంటి వ్యూహన్ని అమలు చేస్తోందో వేచి చూడాలి. -
వీహెచ్‌పీ నుంచి వైదొలగిన తొగాడియా
గుర్గావ్: గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్‌పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. వీహెచ్‌పీ కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్‌పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. -
వీహెచ్‌పీని చీల్చేందుకు తొగాడియా వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రవీణ్ తొగాడియాను తొలగించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తుండగా, ఆయన విశ్వ హిందూ పరిషత్నే చీల్చేందుకు, తద్వారా సంఘ్ పరివార్‌లో కొత్త సమీకరణలకు తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుయాయులు తెలియజేస్తున్నారు. గత వారం కొన్ని గంటలపాటు అదృశ్యమైన ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా ఆస్పత్రిలో ప్రత్యక్షమవడం, తనను ఎన్కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించడం తెల్సిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రవీణ్ తొగాడియా ఓ పుస్తకం రాస్తున్నారని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో రామాలయం నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో విఫలమైనట్లు తొగాడియా ఆరోపించారని, అందుకని వీహెచ్‌పీ పదవి నుంచి ఆయన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను ఎన్కౌంటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని తొగాడియా ఆరోపించారు. తనను పదవి నుంచి తొలగించక ముందే విశ్వ హిందూ పరిషత్‌లో తన వర్గీయులతో కలసి విడిపోవాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల నినాదం చేసుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్న మోదీ–బీజేపీ వ్యూహాన్ని ముందుగానే దెబ్బగొట్టాలని కూడా తొగాడియా యోచిస్తున్నారట. అందుకని తక్షణమే రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాలని, తద్వారా హిందూ పరివారంలో కొత్త సమీకరణలకు తెర తీయాలని ఆయన వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ప్రవీణ్ తొగాడియాతో శ్రీరామ్ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్, ఉత్తర గుజరాత్ వీహెచ్‌పీ నాయకుడు అశ్విన్ భాయ్ పటేల్ తదితరులు సమావేశమవడం ఆయన భవిష్యత్ వ్యూహాన్ని సూచిస్తోంది. సంక్షోభం నివారణలో భాగంగా 2002లో హిందువులను, వీహెచ్‌పీ, భజరంగ్ దళాలను టార్గెట్ చేసిన గుజరాత్ పోలీసులు ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియాను టార్గెట్ చేశాయని ఆరోపించారు. ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు కలిగిన స్వామి చిన్మయానంద లాంటి వాళ్లు తొగాడియాలను తొలగించాలనే కోరుకుంటున్నారు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌లు భావిస్తున్నారు. వీహెచ్‌పీ కార్యదర్శి సురేంద్ర జైన్ కూడా తొగాడియాను కలుసుకొని మంతనాలు జరిపారు. -
హిందూ రాజ్యంతోనే ధర్మపాలన
నల్లగొండ: పరిపాలనలో హిందువులు భాగస్వాములైనప్పుడే ధర్మపరిపాలన సాధ్యమవుతోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. నల్లగొండలో ఆదివారం లయన్స్ క్లబ్లో వైద్యులు, పట్టణ ప్రముఖులుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వీహెచ్‌పీ కార్యకర్తలతో మాట్లాడారు. హిందువుల చేతిలో పరిపాలన ఉండాలంటే కానిస్టేబుల్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ హిందువులే ఉండాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతున్నట్లు పేర్కొన్నారు. -
'భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు'
కరీంనగర్: భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు' అని వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్లో తొగాడియ విలేకరులతోమాట్లాడారు. రాబోయో రోజుల్లో హిందూ దేశంలో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల సంక్షేమానికి హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా అయోధ్యలో రామమందిర్ నిర్మించి తీరుతామని తొగాడియా స్పష్టం చేశారు. మందిర్ నిర్మాణం వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదని విమర్శించారు. రామనవమి రోజున లక్ష మందితో రామమందిర్ సంకల్ప ఉత్సవం నిర్వహిస్తామని ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. -
'జనాభా తగ్గడం హిందూ అస్తిత్వానికే ప్రమాదకరం'
తిరుమల: దేశంలో హిందువుల జనాభా తగ్గడం వారి అస్తిత్వానికే ప్రమాదకరమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. దేశంలో చట్టం అందరికీ ఒకే విధంగా ఉండకపోవడం వల్లే ముస్లింల జనాభా పెరిగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువులకు చెందిన ప్రతీ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండేలా చైతన్యం కలిగిస్తామని చెప్పారు. మతమార్పిడులకు అవకాశం లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు అన్ని మతాలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
'ఆ ఘటనకు చంద్రబాబుదే బాధ్యత'
పశ్చిమగోదావరి(నరసాపురం): గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాలలో శనివారం నిర్వహించిన పుష్కర హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. పవిత్ర పుష్కరాల తొలి రోజే 27 మంది మరణించడం బాధకరమని అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈసందర్భంగా బాబు సర్కారుపై తొగాడియా మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుతం హిందువులు మైనార్టీలుగా ఉన్నారని, రాబోయే వందేళ్లలో భారతదేశంలో హిందువులే మైనార్టీలుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందుకే హిందుత్వాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తొగాడియా పేర్కొన్నారు. హిందువుల పురోభివృద్ధికి, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిపుష్టి కోసం వీహెచ్‌పీ కృషి చేస్తుందన్నారు. -
'భారత్‌ను హిందూరాజ్యంగా ప్రకటిస్తేనే రక్షణ'
నెల్లూరు: భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందని ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. దేశంలో తీవ్రవాదాన్ని అణచివేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ - కశ్మీర్లో హిందువుల ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో మరోసారి పునరాలోచించాలని ప్రవీణ్ తొగాడియా అన్నారు. -
తొగాడియాను కర్ణాటకలో కాలు పెట్టనివ్వం
కర్ణాటక హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడి బెంగళూరు : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా విశ్వహిందూపరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాను కర్ణాటకలో అడుగుపెట్టనివ్వబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ప్రసంగాలను అనుమతించబోమని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ స్పష్టం చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుత్తూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ప్రవీణ్ తొగాడియా పాల్గొని ప్రసంగించారని, అనంతరం ఆయా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మరే ప్రాంతంలోనూ ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించాల్సి వస్తోందని, ఇందులో మరే దురుద్దేశం లేదని అన్నారు. జర్మనీలోని ఓ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధికి ‘అత్యాచారాల దేశం’ నుంచి వచ్చిన వారంటూ గుర్తింపువేసి ఇంటర్న్‌షిప్‌లో చేర్చుకునేందుకు నిరాకరించడం బాధాకరమని అన్నారు.