యోగి ఆధిత్యానాథ్ (ఫైల్ ఫోటో)
లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తీసుకురానుంది. దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సోమవారం ఆయోధ్యను సందిర్శించారు. అక్కడ నిర్వహించిన శాంతి సమ్మెళనంలో సీఎంతో సహా పలువులు బీజేపీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల లోపు రామమందిర నిర్మాణం ప్రారంభించి ఎడాది లోపే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణంపై ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోకూడదని, ప్రణాళిక ప్రకారమే ఆయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని పేర్కొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థ అదేశాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ ఎంపీ, రామ్ విలాస్ వేధాంతి మాట్లాడుతూ.. మొగల్ చక్రవర్తి బాబార్ ఎవ్వరి అనుమతులు లేకుండా రామమందిరాన్ని కూల్చివేశాడని, 1992 బాబ్రీ మసీద్ కూడా అదే విధంగా కూల్చీ వేయబడిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల లోపే రామమందిర నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నేడు ఆయోధ్యను సందర్శించనున్నారు. బీజేపీ కావాలనే రామమందిర నిర్మాణం అలస్యం చేస్తోందని తొగాడియా గతంలో పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment