
నల్లగొండ: పరిపాలనలో హిందువులు భాగస్వాములైనప్పుడే ధర్మపరిపాలన సాధ్యమవుతోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. నల్లగొండలో ఆదివారం లయన్స్ క్లబ్‌లో వైద్యులు, పట్టణ ప్రముఖులుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వీహెచ్‌పీ కార్యకర్తలతో మాట్లాడారు. హిందువుల చేతిలో పరిపాలన ఉండాలంటే కానిస్టేబుల్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ హిందువులే ఉండాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment